AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే.. హీరో సిస్టర్ కామెంట్స్..

దివంగత హీరో ఉదయ్ కిరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ ఇచ్చిన హీరో. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్.. కెరీర్ పీక్స్ లోకి వెళ్లాల్సిన సమయంలోనే అనుహ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే.. హీరో సిస్టర్ కామెంట్స్..
Uday Kiran Sister
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2026 | 9:25 AM

Share

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తెలిసిందే. ఇటీవల ఆయన సోదరి శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సోదరుడి గురించి అనేక గుర్తుండిపోయే విషయాలను పంచుకున్నారు. ఉదయ్ కిరణ్ ఎంతటి భావోద్వేగమైన, సున్నితమైన వ్యక్తిత్వం కలవాడో ఆమె వెల్లడించారు. మనసంతా నువ్వే సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో, ఉదయ్ కిరణ్ అభిమానులు, కుటుంబ సభ్యులు అతని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మాటల్లో, ఉదయ్ కిరణ్ చాలా ఎమోషనల్ పర్సన్. తనకు బాధగా ఉన్నప్పుడు సాగర సంగమం సినిమా పెట్టుకుని ఏడ్చేవాడని తెలిపారు. తన అక్కగా, తాను చెప్పని ఎన్నో విషయాలను ఆమెతో పంచుకునేవాడని. వారిద్దరి మధ్య ఎప్పుడూ దూరం రాలేదు, గొడవలు పడలేదని చెప్పుకొచ్చారు.. అప్పుడప్పుడు “అక్కా, నేను నీతో మాట్లాడను” అన్నా, రెండు నిమిషాల్లోనే మళ్లీ పలకరించేవాడని శ్రీదేవి గుర్తుచేసుకున్నారు. తన పిల్లలంటే ఉదయ్ కిరణ్‌కు ఎంతో ప్రాణం. ముఖ్యంగా తన కూతురి విషయంలో అతను చాలా పొసెసివ్‌గా ఉండేవాడని అన్నారు. “ఎందుకు ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తావు?” అని ప్రశ్నిస్తూ, చిన్న ఐప్యాడ్ కూడా కొనేవాడు కాదట. తన మేనల్లుడిని “This is my boy. I am going to bring him up in my style” అని ఎత్తుకున్నప్పుడు, అతనిలో మేనమామ ప్రేమ స్పష్టంగా కనిపించేదని శ్రీదేవి తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ చేసే పని డ్రైవ్‌కు వెళ్లడం. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని, ఎలాంటి మాటలు లేకుండా కేవలం మ్యూజిక్ వింటూ ప్రయాణించేవాడట. అది అతను ఒత్తిడిలో ఉన్నాడని ఆమెకు చెప్పకనే చెప్పే సంకేతమని వివరించారు. అభిమానుల పట్ల ఉదయ్ కిరణ్ చాలా గౌరవంగా ఉండేవారు. ఒక అమ్మాయి రక్తం అడ్డంకి లేఖ రాస్తే అతను చాలా కోపంగా, “ఇది జీవితం, రక్తాన్ని అగౌరవపరచడం” అని అన్న సంఘటనను వివరించారు. అలాగే, తిరుపతిలో ఒక అభిమాని ఫోటో, ఆటోగ్రాఫ్ అడిగితే, “బాస్, మనం దేవుడి దగ్గర ఉన్నాము. ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద ఇక్కడ. మనమంతా ఒకటే ఆయన ముందు. బయట కలుద్దాం, అన్నీ చేస్తాను” అని ఎంతో స్వీట్‌గా, ఓపికగా చెప్పాడని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ఉదయ్ కిరణ్ స్వభావం ఎప్పటికీ ఒకేలా ఉండేది. నటుడిగా ఎదిగిన తర్వాత కూడా ఎప్పుడూ డౌన్ టు ఎర్త్‌గా ఉంటూ, ఎక్కడ కనిపించినా కారు దిగి పలకరించేవాడని తెలిపారు. ప్రస్తుత తరం హీరోలలో నాని, విజయ్ దేవరకొండలలో ఉదయ్ కిరణ్ లక్షణాలు కనిపిస్తాయని శ్రీదేవి అన్నారు. ముఖ్యంగా నానితో ఉదయ్ చాలా సన్నిహితంగా ఉండేవాడని, నాని తన పెళ్ళిలో కూడా వచ్చాడని, ఉదయ్ కిరణ్ మరణం తర్వాత తమ ఇంటికి వచ్చి పలకరించాడని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాని, తరుణ్, ఎన్టీఆర్, అల్లరి నరేష్ వంటివారితో ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులు అని, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్‌కు వెళ్లిన విషయాలను కూడా ఉదయ్ కిరణ్ తమతో పంచుకునేవాడని శ్రీదేవి పేర్కొన్నారు.

నాని, ఉదయ్ కిరణ్..

Uday Kiran, Nani

Uday Kiran, Nani

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
"ముందు మీ దేశాన్ని చూసుకోండి".. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన
రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది..
రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది..
ఇక స్టోరేజ్ ఫుల్ తలనొప్పి ఉండదు.. జీమెయిల్‌లో దాగున్న ఈ సీక్రెట్
ఇక స్టోరేజ్ ఫుల్ తలనొప్పి ఉండదు.. జీమెయిల్‌లో దాగున్న ఈ సీక్రెట్