AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఇదేం రొయ్యరా సామీ..! సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దంతో..

సముద్ర గర్భంలో ఎన్నో రకాల వింత జీవులు నివసిస్తుంటాయి. అయితే, కేవలం 4 సెంటీమీటర్ల పొడవు, 25 గ్రాముల బరువు ఉండే పిస్టల్ ష్రింప్ చేసే విన్యాసాలు చూస్తే శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ జీవి తన శరీర పరిమాణంతో సంబంధం లేకుండా సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన వేటగాడిగా మారుతుంది. పరిమాణంలో చిన్నదైనప్పటికీ, తన శరీరంలో సగం పరిమాణంలో ఉండే భారీ గిట్ట సహాయంతో ఇది చేసే దాడి సముద్రంలోనే ఒక విచిత్రమైన దృగ్విషయం.

ఓరీ దేవుడో ఇదేం రొయ్యరా సామీ..! సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దంతో..
Pistol Shrimp
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2026 | 7:19 AM

Share

ప్రపంచ మహాసముద్రాల అడుగున నివసించే వింత జీవులలో పిస్టల్ రొయ్య అత్యంత ఆసక్తికరమైనది. శాస్త్రీయంగా ఆల్ఫెయిడే కుటుంబానికి చెందిన ఈ జీవి ప్రధానంగా ఉష్ణమండల సముద్రాలు, కోరల్ రీఫ్‌లలో కనిపిస్తుంది. పరిమాణంలో చిన్నదైనప్పటికీ, తన శరీరంలో సగం పరిమాణంలో ఉండే భారీ గిట్ట సహాయంతో ఇది చేసే దాడి సముద్రంలోనే ఒక విచిత్రమైన దృగ్విషయం. పిస్టల్ రొయ్య వేటాడే విధానం అత్యంత శక్తివంతమైనది. ఇది తన పంజాను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా మూసివేస్తుంది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, పిస్టల్ ష్రింప్ తన ఆహారాన్ని వేటాడేందుకు పళ్ళు లేదా విషాన్ని ఉపయోగించదు. దీనికి సగం శరీరం పరిమాణంలో ఉండే ఒక పెద్ద పంజా ఉంటుంది. ఈ పంజాను తెరిచి, మెరుపు వేగంతో నొక్కినప్పుడు బెర్నూలీ సూత్రం ఆధారంగా నీరు సెకనుకు 25 మీటర్ల వేగంతో బయటకు చిమ్ముతుంది. ఈ ఒత్తిడికి నీటిలో క్యావిటేషన్ అనే ఒక బుడగ ఏర్పడుతుంది. ఈ బుడగ పగిలిపోయిన క్షణంలో ఊహించని స్థాయిలో శక్తి, వేడి, శబ్ద తరంగాలు విడుదలవుతాయి.

ఈ నీటి బుడగ సెకనులో అత్యంత స్వల్ప కాలంలో పేలిపోయినప్పుడు గన్ నుంచి వెలువడే శబ్దంలా 218 డెసిబెళ్ల తీవ్రమైన ధ్వని పుడుతుంది. సాధారణంగా తుపాకీ పేలినప్పుడు వచ్చే శబ్దం కంటే ఇది చాలా ఎక్కువ. ఈ పేలుడు తీవ్రతకు ఆ నీటి బుడగ చుట్టూ క్షణకాలం పాటు ఉష్ణోగ్రత 4,800 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. ఇది దాదాపు సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడితో సమానం. ఈ ధ్వని తరంగాలు, వేడి దెబ్బకు ఎదురుగా ఉండే చిన్న చేపలు, పీతలు తక్షణం స్పృహ తప్పిపోతాయి లేదా మరణిస్తాయి.

ఇవి కూడా చదవండి

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నౌకాదళం సముద్రంలో శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టడానికి ఉపయోగించే సోనార్ సిస్టమ్‌లకు ఈ రొయ్యలు చేసే శబ్దాలు తీవ్ర అంతరాయం కలిగించేవి. ఈ జీవికి ఉన్న అద్భుత శక్తుల నేపథ్యంతో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ పవర్ సూపర్‌హీరో సినిమాను కూడా రూపొందించింది.

ఈ జీవికి ఉన్న మరొక విశేషం అవయవ పునరుత్పత్తి. పోరాటంలో లేదా వేటలో తన పెద్ద పంజా విరిగిపోతే, అది మళ్ళీ పెరుగుతుంది. అంతేకాదు, అప్పటివరకు చిన్నగా ఉన్న మరొక పంజా స్వయంచాలకంగా పెద్ద స్నాపర్ క్లాగా మారిపోవడం ఈ పిస్టల్ ష్రింప్ ప్రత్యేకత. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ జీవి శక్తి సూత్రాన్ని ఉపయోగించి స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారుచేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం