AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదల వాయిదా? అసలు విషయం చెప్పేసిన మేకర్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'జైలర్ 2' సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. అయితే రజనీ మూవీ విడుదల వాయిదా పడుతోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై నిర్మాతలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Rajinikanth Jailer 2: రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? అసలు విషయం చెప్పేసిన మేకర్స్
Rajinikanth Jailer 2
Basha Shek
|

Updated on: Sep 03, 2026 | 7:21 AM

Share

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ విడుదల తేదీ వాయిదా పడుతుందని, సినిమాలోని పలు భాగాలను తిరిగి చిత్రీకరిస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో రజనీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాజాగా ఈ ప్రచారంపై ‘సన్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ స్వయంగా స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 15న ఘనంగా విడుదల కానుందని క్లారిటీ ఇచ్చింది. తాజాగా తమ అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలో జైలర్ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా విడుదల వాయిదా పడలేదని సన్ పిక్చర్స్ ధృవీకరించింది. పోస్టర్‌తో పాటు, ‘ఈ చిత్రం అక్టోబర్ 15న తెరపైకి రానుంది’ అని రాసింది. ఈ చిత్రం దసరా పండుగ సెలవుల్లో విడుదలవుతున్నందున, తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ రజనీకాంత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తో కూడిన టీజర్ కు యూట్యూబ్ లో భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆగస్టులో, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆలా బొలేలో’ సాంగ్ విడుదలైంది. తెలుగు హీరోయిన్ పూర్ణ ఇందులో నటించడం గమనార్హం. అలాగే ఈ సాంగ్ లో రజనీకాంత్ మాస్ లుక్ ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, కలానిధి మారన్ (సన్ పిక్చర్స్) నిర్మించిన ఈ చిత్రం, 2023లో వచ్చిన సూపర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్. రజనీకాంత్, రమ్యకృష్ణన్ మళ్లీ భార్యాభర్తలుగా కనిపించనుండగా, యోగి బాబు, మీర్నా, రిత్విక్ తమ పాత్రలలో కొనసాగుతున్నారు. మొదటి భాగంలోని మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌లతో పాటు, ఈసారి ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

సన్ పిక్చర్స్ సంస్థ ట్వీట్..

అల బోలెలో సాంగ్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?