Duologue With Barun Das: ‘డూయోలాగ్ విత్ బరున్ దాస్’.. దేవరకొండ తర్వాత రాబోయే గెస్ట్ ఎవరో తెలుసా ?.. ఆయన ఓ లెజెండ్..

| Edited By: Ravi Kiran

Aug 27, 2022 | 9:02 AM

రౌడీ జీవితం, సినీ ప్రస్థానంకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చర్చించారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఆగస్ట్ 26న న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus) రిలీజ్ అయ్యింది.

Duologue With Barun Das: డూయోలాగ్ విత్ బరున్ దాస్.. దేవరకొండ తర్వాత రాబోయే గెస్ట్ ఎవరో తెలుసా ?.. ఆయన ఓ లెజెండ్..
News 9
Follow us on

టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈఓ బరున్ దాస్ హోస్ట్‏గా ప్రారంభమైన సరికొత్త టాక్ షో ‘డూయోలాగ్ విత్ బరున్ దాస్’. ఈ షోలో బరున్ దాస్ రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో వారి లైఫ్‏స్టైల్, ఫిలాసఫి, వృత్తి అంశాలలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షో మొదటి అతిథిగా లైగర్ హీరో విజయ్ దేవరకొండ విచ్చేశారు. రౌడీ జీవితం, సినీ ప్రస్థానంకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చర్చించారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఆగస్ట్ 26న న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus) రిలీజ్ అయ్యింది.

ఈషోలో విజయ్ తర్వాత అతిథిగా యూకే మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ విచ్చేశారు. రెండు దశాబ్దాల కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా.. భారతదేశంతో తత్ససంబంధాలు కొనసాగిస్తూ.. గొప్ప రాజకీయ నాయకుడిగా అతి పిన్న వయస్సులోనే  చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండ్స్‏తో ప్రత్యేక ఇంటర్వ్యూలు జరపడమే ఈ డూయోలాగ్ షో ప్రధాన థీమ్. ప్రముఖుల వ్యక్తిగత జీవితం.. వారి కెరీర్‏ గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం కంటెంట్ రూపొందిచేందుకు ఉన్న పోటీ వాతావరణంలో దీర్ఘకాలికంగా తట్టుకుని నిలబడేందుకు అందరికీ ప్లేస్ ఉందని నేను నమ్ముతున్నాను. గొప్ప ఆలోచనలను ఏకం చేసి దేశ అభివృద్ధిలో భాగం చేసేందుకు మేం ఈ రోల్ పోషిస్తున్నాం అన్నారు బరున్ దాస్.

“బరున్ దాస్ గొప్ప వ్యాపారవేత్త, ఫేమస్ హోస్ట్ కాదు. కానీ ప్రస్తుతం సీఈవోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గురించి ప్రజలకు అంతగా తెలియదు. కానీ ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తూ.. దేశ అభివృద్ధి కోసం పాటుపడిన టాలెంటెడ్ పర్సన్స్‏తో ప్రత్యేక ఇంటర్వ్యలు చేసి.. వారి కథలను ఏకం చేసే అసాధారణమైన సామర్థ్యం ఉంది. అయితే, పబ్లిక్ డొమైన్‌లో మాత్రం ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తాయి’ అని న్యూస్9ప్లస్ ఎడిటర్ సందీప్ ఉన్నితాన్ పేర్కొన్నారు. ఈ షోలో నాలుగు మినీ ఎపిసోడ్‏లు కలిగిన మొదటి సీజన్ పూర్తిగా విజయ్, బరున్ దాస్ మధ్య సంబాషణ మాత్రమే కాకుండా.. ఇప్పటివరకు ప్రజలకు తెలియని అనేక ఆసక్తికర విషయాల గురించి ముచ్చటించారు.

డూయోలాగ్ విత్ బరున్ దాస్ షో ఎంతో సరదగా సాగిపోతుంది. ఇలాంటి సరికొత్త కంటెంట్ ప్రజలను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలోనూ ఈషో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనుకుంటున్నాను అని తెలిపారు చోప్రా ఫౌండేషన్ సీఈఓ, సేవా. లవ్ వ్యవస్థాపకుడు పూనచమాచయ్య. ఈ కార్యక్రమం ఇప్పుడు న్యూస్ 9 ప్లస్ యాప్‏లో ప్రసారం కానుంది. వీడియో చూడాలంటే News 9plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Android, iOS యూజర్లు పక్కనున్న లింక్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి : http://onelink.to/htmqpz