Tollywood: కోరికలు తీర్చుకోవడానికే సహజీవనం.. పెళ్లి చేసుకోవడం ఎందుకు.. ? సీరియల్ నటి సంచలన కామెంట్స్..

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ తారలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో సీరియల్ నటీనటులు ఇంటర్వ్యూలలో చేసే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ సహాయ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: కోరికలు తీర్చుకోవడానికే సహజీవనం.. పెళ్లి చేసుకోవడం ఎందుకు.. ? సీరియల్ నటి సంచలన కామెంట్స్..
Srivani

Updated on: Dec 28, 2025 | 6:56 AM

బుల్లితెరపై అనేక సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీవాణి. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న శ్రీవాణి.. వ్యక్తిగత జీవితం, పెళ్లి లివింగ్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే జీవితంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా సహజీవనం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. గొడవ సినిమాలో చిన్న పాత్ర పోషించి నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సినీరంజనీ కార్యక్రమంలో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో టీవీ అవకాశాలు రావడంతో సంఘర్షణ, కాంచనగంగ, చంద్రముఖి వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పటికీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న ఆమె.. పెళ్లి పై ప్రశ్నించగా.. ఈరోజుల్లో చాలా మంది పెళ్లిని తేలికగా తీసుకొంటున్నారని.. పెళ్లి ఇప్పుడు అవసరం లేదని భావించేవారు పెళ్లి తర్వాత .. పిల్లలు పుట్టి తర్వాత తాము పడే కష్టాలు అర్థం చేసుకుంటారని అన్నారు.

జీవితంలో పెళ్లి తప్పనిసరి అని.. ఒక తోడు ఉండాలని అన్నారు. మనం ఎంచుకున్న వ్యక్తి ఎవరో చూసి పెళ్లి చేసుకునే ముందు మన సమయాన్ని తీసుకోవాలి. వివాహం అయిన వెంటనే పిల్లలను కనకూడదు, రెండేళ్ల తర్వాత ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే, పిల్లల మధ్య విభేదాలు మన భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి అని అన్నారు. ప్రస్తుతం చాలా మంది సహజీవనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని.. ఈ ఆలోచన ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇవ్వదని అన్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

Srivani News

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..