Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్ !

|

Oct 18, 2020 | 7:09 PM

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోని పరిణామాలపై సోషల్ మీడియాలో  తీవ్రమైన ట్రోలింగ్  జరుగుతుంది. వీక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా హౌస్‌  నిర్వాహకులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్  !
Follow us on

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోని పరిణామాలపై సోషల్ మీడియాలో  తీవ్రమైన ట్రోలింగ్  జరుగుతుంది. వీక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా హౌస్‌  నిర్వాహకులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మూడు సీజన్స్‌తో పోలిస్తే ఈ సారి సీజన్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత స్టైయిట్‌ అండ్ ఫెయిర్‌గా ఆడిన దేవీ నాగవల్లీ ఎలా ఎలిమినేట్ అయ్యారో వీక్షకులతో పాటు ఆమెకు కూడా బిగ్ క్వచ్చన్. దీనిపై సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు కుమార్  సాయిని ఏకంగా హౌస్‌ నుంచి గెంటేసినట్టే నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న వ్యక్తులపై పలు వెబ్‌సైట్లు ఓటింగ్ నిర్వహించాయి. అందులో మోనల్, నోయల్ ప్రమాదంలో ఉన్నట్లు అన్నీ సర్వేలు తెలిపాయి. కానీ అనూహ్యంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వీక్షకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అసలు సేఫ్ గేమ్ ఆడేది హౌస్‌లోని సభ్యుల కాదు..బిగ్ బాస్ నిర్వాహకులే అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో  కుమార్ సాయిని టార్గెట్ చేస్తారని ముందుగానే గ్రహించిన వీక్షకులు, అతడికి భారీగా ఓట్లు వేశారు. అంత చేసినా కూడా అతడిని ఎలిమినేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ఇక మోనల్‌ని గ్లామర్ కోసం,  ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోసం బిగ్ బాస్ కావాలనే కాపుడుతున్నాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్..  ఇటీవల మెహబూబ్‌ని సోహైల్ చేత సేవ్ చేసిన విధానంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోపై నమ్మకం పోతుంది బాస్…తస్మాత్ జాగ్రత్త.

( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )