Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..

సినీరంగంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రీ. కేవలం ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. దీంతో హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే త్రిప్తి డిమ్రీ రెమ్యునరేషన్ పై క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..
Triptii Dimri

Updated on: May 27, 2025 | 10:24 AM

త్రిప్తి డిమ్రీ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. యానిమల్ సినిమాలో చిన్న పాత్ర పోషించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టనుంది త్రిప్తి. అంతేకాదు.. పాన్-ఇండియా సూపర్‌స్టార్‌తో కలిసి ఆమె నటించనున్న తొలి చిత్రం ఇదే.

అయితే స్పిరిట్ మూవీకి ముందుగా దీపికా పదుకొణె హీరోయిన్ అనుకున్నారు. కానీ చివరకు ఆమె స్థానంలోకి త్రిప్తి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ ఆఫర్ రావడంతో త్రిప్తి డిమ్రీ రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. గతంలో ఒక్కో సినిమాకు రూ.40 లక్షలు పారితోషికం తీసుకుంది త్రిప్తి. కానీ యానిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో నెమ్మదిగా రెమ్యునరేషన్ పెంచేసింది. అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం త్రిప్తి రూ. 5 కోట్లు తీసుకుంటుందని టాక్. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..