ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందింది. కార్డియాక్‌అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు.