Year Ender 2024: ఈ ఏడాదిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..

|

Dec 31, 2024 | 8:12 AM

2024లో సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి.. తెలుగు 2024లో సినిమాలు దుమ్ములేపాయి. ప్రపంచమంతా మన సినిమాల వైపే చూసేలా చేశాయి. 100, 200కోట్లు కాదు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించాయి. అంతే కాదు ఇతరభాషల్లోనూ నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి 

Year Ender 2024: ఈ ఏడాదిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..
Tollywood
Follow us on

పుష్ప 2 : సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాలో. ఫహద్  ఫాసిల్, సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు నటించారు.”పుష్ప 2 ది రూల్” చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. 2021లో వచ్చిన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలైన దాదాపు 25 రోజుల్లో రూ.1800 కోట్లు వసూలు చేసింది.

కల్కి 2898 AD: వైజయంతీ మూవీస్ నిర్మించినమూవీ కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితరులు నటించారు. ఈ సినిమా ఏకంగా రూ.1,100 కోట్లు వసూలు చేసింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలో 2వ భాగాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

స్త్రీ 2: అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2 ఆగస్ట్ 15న విడుదలైంది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా శ్రీనాథ్, తమన్నా భాటియా, సునీల్ కుమార్, అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 874 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమా అభిమానులను ఆకట్టుకుంది.

గోట్ : వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”. తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ 3 పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, జయరామ్ తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం రూ.450 కోట్లు వసూలు చేసింది. తమిళ చిత్రసీమలో 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

దేవర పార్ట్ 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్. అనిరుధ్ సంగీతం అందించిన చిత్రం “దేవర పార్ట్ 1” ఘనవిజయం సాధించింది. గత సెప్టెంబర్‌లో విడుదలైంది ఈ సినిమా. యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.408 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

అమరన్: రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా అమరన్.  అమరన్ చిత్రం దీపావళికి విడుదలైంది. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చాలా మందిని కదిలించింది. ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.

హనుమాన్: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం “హనుమాన్”. హనుమాన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి సందర్భంగా విడుదలైంది. హనుమాన్ సినిమా రూ.300 కోట్లు వసూలు చేసింది.