చూస్తూ చూస్తూనే 2024కూడా అయిపొయింది. 2024కు గుడ్ బై చెప్పి.. 2025కు వెల్కమ్ చెప్పనున్నాం.. దాంతో ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ ఏడాది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. కుర్రహీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. అలాగే సీనియర్ భామలు బడా సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం ఈ ఏడాది సినిమాలకు దూరంగా ఉన్నారు. 2024లో ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్స్ ఎవరో తెలుసా.?
నయనతార: ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్స్ లో మొదటిగా చెప్పుకోవాల్సింది నయనతార గురించే. ఈ లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. గత సంవత్సరం 2023 లో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటించింది. ఆతర్వాత మరో సినిమా చేయలేదు. 2024మొత్తం ఆమె సినిమాలకు దూరంగా ఉంది.
శృతి హాసన్ : నటుడు కమల్ హాసన్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.2023లో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో కనిపించింది. సలార్ మూవీ పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ వచ్చింది. 2024లో ఈ చిన్నది ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
త్రిష: తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక త్రిష ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. విజయ్ నటించిన గోట్ సినిమాలో ఆమె ఒక్క పాటకు మాత్రమే డ్యాన్స్ చేసింది. 2025లోవరుస సినిమాలు లైనప్ చేసింది. అలాగే సూర్య 45 సినిమా కూడా చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.