Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు టాలీవుడ్ హీరోయిన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇలా మారిపోయిందేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం అత్యంత అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా ఒక టాలీవుడ్ హీరోయిన్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక ప్రత్యేక కానుకను బహూకరించింది.

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు టాలీవుడ్ హీరోయిన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇలా మారిపోయిందేంటి?
Chandrababu Naidu

Updated on: May 19, 2025 | 12:46 PM

 

పై ఫొటోలో సీఎం చంద్రబాబు నాయుడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? తెలుగు సినిమాలు, రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఆమె బాగానే తెలిసి ఉంటుంది. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. మొదట హీరోయిన్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సెకెండ్ హీరోయిన్ గా, మరి కొన్ని సినిమాల్లో సహాయక నటి పాత్రల్లో కనిపించింది. అయితే 2018 తర్వాత ఈ నటి సినిమాలకు పూర్తిగా దూరమైంది. సామాజిక సమస్యలతో పాటు రాజకీయాలపైనా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ పై తరచూ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఆమె మరెవరో కాదు పూనమ్ కౌర్. తాజాగా ఆమె ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఓ ఆర్ట్ వర్క్‌ ను బహుమతిని కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ఆర్ట్ వర్క్ ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూనమ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా నెట్టింట వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

 

కాగా చాలా రోజుల తర్వాత బయట కనిపించిన పూనమ్ కౌర్ బాగా బొద్దుగా మారిపోయినట్లు కనిపించింది. ఆమె ఏదో అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోందని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే తన ఆరోగ్య పరిస్థితిపై పూనమ్ ఒక క్లారిటీ ఇచ్చింది . తనకు ఫుడ్ అలర్జీ ఉందని, అలాగే ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో త‌న‌కి ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తన ఆరోగ్య సమస్యల వల్లే శరీరం ఉబ్బుతోందని, అందుకే లావుగా కనిపిస్తున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా పూనమ్ ఇలా బొద్దుగా కనిపించడానికి ఆ ఆరోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది. దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పూనమ్ కు సూచిస్తున్నారు.

చంద్రబాబుతో పూనమ్ కౌర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..