Tollywood: మహేష్ సినిమా తర్వాత మాదే హవా అంటున్న కుర్ర హీరోలు..

|

May 09, 2022 | 10:11 PM

వరుసగా పాన్ ఇండియా రిలీజ్‌లతో బాక్సాఫీస్ దగ్గర హెవీ రష్ కనిపించింది.. ఆ తరువాత రీజినల్‌ సెగ్మెంట్‌లోనూ భారీ చిత్రాలే రిలీజ్‌కు క్యూ కట్టడంతో చిన్న, మీడియం రేంజ్‌ సినిమాలకు స్పేస్ లేకుండా పోయింది

Tollywood: మహేష్ సినిమా తర్వాత మాదే హవా అంటున్న కుర్ర హీరోలు..
Tollywood
Follow us on

వరుసగా పాన్ ఇండియా రిలీజ్‌లతో బాక్సాఫీస్ దగ్గర హెవీ రష్ కనిపించింది.. ఆ తరువాత రీజినల్‌ సెగ్మెంట్‌లోనూ భారీ చిత్రాలే రిలీజ్‌కు క్యూ కట్టడంతో చిన్న, మీడియం రేంజ్‌ సినిమాలకు స్పేస్ లేకుండా పోయింది. కానీ సర్కారువారి పాట రిలీజ్ తరువాత మాత్రం హవా అంతా మాదే అంటున్నారు యంగ్ హీరోలు. మిగతా సమ్మర్ అడ్వాంటేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. మే 12న సూపర్ స్టార్ సర్కారువారి పాట ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఇక ఈ సినిమాతో భారీ చిత్రాల ఫ్లోకు బ్రేక్ పడినట్టే. అందుకే నెక్ట్స్ వీక్‌ నుంచి హవా అంటే మాదే అంటున్నారు యంగ్ హీరోలు. మహేష్ ఎంట్రీ ఇచ్చిన వారం గ్యాప్‌లోనే మే 20కి థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు కుర్ర హీరో నాగ శౌర్య.

ఫుల్‌ యాక్షన్ అవతార్‌లో లక్ష్య, డిసెంట్‌ హీరోగా వరుడు కావలెను సినిమాలు చేసిన శౌర్య.. నెక్ట్స్ మూవీలో మరో డిఫరెంట్ యాంగిల్ చూపించబోతున్నారు. కృష్ణా వ్రిందా విహారి సినిమాలో ట్రెడిషనల్ కుర్రాడిగా కొత్త గెటప్‌లో దర్శనమిస్తున్నారు. మిడ్ జూన్‌ వరకు సమ్మర్ హాలీడేస్ కంటిన్యూ అవుతాయి. సో ఈ అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మరికొంత మంది హీరోలు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ జూన్ 3న రిలీజ్ అంటూ గ్రాండ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది మేజర్‌ టీమ్‌. మీడియం రేంజ్ హీరో అడివి శేష్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ మీద కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. పేట్రియాటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ కావటంతో కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్‌.

స్కూల్‌ స్టార్ట్ అవ్వడానికి ముందే థియేటర్లలోకి వచ్చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. అంటే సుందరానికి అంటూ ఓ డిఫరెంట్ కామెడీ మూవీతో మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింట్లోనూ డైరెక్ట్ రిలీజ్‌ ప్లాన్ చేస్తున్నారు నాని. కొవిడ్ వల్ల వచ్చిన బ్రేక్‌తో చాలా సినిమాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో సిచ్యుయేషన్ సెట్ అయ్యాక బాక్సాఫీస్ ముందు రష్ ఎక్కువైంది. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా రిలీజ్‌లకు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్‌. ఆఫ్టర్ సమ్మర్ కూడా వరుస రిలీజ్‌లతో సిల్వర్‌ స్క్రీన్‌ కళకళలాడబోతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా. తమిళ్‌లో అర్జున్‌ రెడ్డి సినిమాను రీమేక్‌ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ మూవీ. ఆల్రెడీ ప్రమోషన్‌ షురూ చేసిన మూవీ టీమ్ జూలై 1న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన విరాటపర్వం సినిమా కూడా జూలై 1న ఆడియన్స్ ముందుకు రానుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథ మీద ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన థాంక్యూ కూడా జూలైలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ది వారియర్‌. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కిస్తున్న ఈ బైలింగ్యువల్ మూవీ జూలై 14న రిలీజ్‌ కానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్‌… వరుస అప్‌డేట్స్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇక హిట్ ఫార్ములాతో నిర్మాతగానూ సక్సెస్‌ అయిన నాని కూడా జూలై మంథ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతున్న హిట్ సీక్వెల్‌ను జూలై 29న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు. జూన్‌లో మేజర్‌గా ఎంట్రీ ఇస్తున్న అడివి శేష్‌ నెక్ట్స్ మంథ్‌ హిట్‌ 2తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..