తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తనదైన మార్క్ పాలన ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం అమలు చేశారు. అలాగే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని.. ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సినీ, ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి.. తెలుగులో యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే రాజ్ తరుణ్‌తో అహా నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని విన్నపాలు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ప్రజా సమస్యల గురించి వెల్లడిస్తూనే.. సినీ పరిశ్రమలోని సమస్యలను తెలియజేశాడు.
Dear Chief Minister @revanth_anumula Garu (MAUD, G.A., Law & Order) and Minister for R&B and Cinematography @KomatireddyKVR Garu, attached are posters presenting requests for your consideration. #OnlinePrajaDarbar #DigitalPrajaDarbar pic.twitter.com/KlM2OX88kq
— Sanjeev Reddy (@sanjeevflicks) December 11, 2023
తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డులను, ఫిల్మ్ ఫెస్టివల్స్ ను స్టార్ట్ చేయాలని కోరారు. అలాగే అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు మీ పద్ధతి ప్రకారం ఇళ్లు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరని పేర్కొన్నారు.
Dear Chief Minister @revanth_anumula Garu, congratulations on your new responsibility! Here’s to a successful and impactful term leading Telangana. Best wishes 💐 #RevanthReddycm #CMofTelangana pic.twitter.com/IDecnaVFdF
— Sanjeev Reddy (@sanjeevflicks) December 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.