
టాలీవుడ్లో ఉన్న ఫేమస్ రైటర్స్‌లో కోన వెంకట్ ఒకరు. ఒకప్పుడు మరో రచయిత గోపి మోహన్‌తో కలిసి.. శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఉండేవారు. బయట కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ఆపై పొడ్యూసర్‌గానూ మంచి సక్సెస్‌లు అందుకున్నారు. తాజాగా పులి మేక చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కోన వెంకట్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా కోన వెంకట్ తన లైఫ్ మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. తాను ఒకానొక సమయంలో సూడసైడ్‌కు సిద్ధపడినట్లు తెలిపారు. అప్పుడు 30 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యానని, కానీ ఓ అమ్మాయిని చూసి ఆ మాత్రలన్నీ కింద పడేశానని వెల్లడించారు.
“ఆ అమ్మాయికి 2 చేతులు, 2 కాళ్లు లేవు. 7 నుంచి 8 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆమె బ్రదర్‌కు 12 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. ఆమెను ఓ వీల్ చెయిర్‌లో ఉంచి.. ఆ అబ్బాయి.. ముందుకు తీసుకెళ్తున్నాడు. అందరి వద్దకు తిరగుతూ వాళ్లు బీచ్‌లో హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా కనిపించారు. వాళ్లను చూసి షాకయ్యా. వెంటనే చేతిలోనే చేతిలోని నిద్ర మాత్రలు పక్కకు విసిరేసా. తిరిగి ఇంటికెళ్లిపోయా. ఆ తర్వాత నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఆ రోజు ఆ పాపను అలా చూసి ఉండకపోతే.. నేను ఉండేవాడ్ని కాదు. తనకు నిజంగా థ్యాంక్స్. ఆమె నా దేవత” అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.