Pawan Kalyan: పవన్‌పై అభిమానం చాటుకున్న స్టంట్ మ్యాన్‌.. జనసేనకు విరాళంగా ‘భోళాశంకర్‌’ రెమ్యునరేషన్‌

ప్రమాదకరమైన స్టంట్స్‌ను కూడా అలవోకంగా చేసి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీ బద్రి. తనదైన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారాయన. కేవలం తెలుగులోనే కాదు పలు తమిళ్‌ సూపర్‌హిట్ సినిమాలకు కూడా స్టంట్‌మ్యాన్‌గా వ్యవహరించారు శ్రీ బద్రి. తాజాగా చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమాలో కూడా డేరింగ్‌ స్టంట్స్‌ చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

Pawan Kalyan: పవన్‌పై అభిమానం చాటుకున్న స్టంట్ మ్యాన్‌.. జనసేనకు విరాళంగా భోళాశంకర్‌ రెమ్యునరేషన్‌
Pawan Kalyan, Sri Badri

Updated on: Sep 28, 2023 | 11:46 AM

ప్రమాదకరమైన స్టంట్స్‌ను కూడా అలవోకంగా చేసి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీ బద్రి. తనదైన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారాయన. కేవలం తెలుగులోనే కాదు పలు తమిళ్‌ సూపర్‌హిట్ సినిమాలకు కూడా స్టంట్‌మ్యాన్‌గా వ్యవహరించారు శ్రీ బద్రి. తాజాగా చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమాలో కూడా డేరింగ్‌ స్టంట్స్‌ చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ఓ కారును నడుపుతూ ఓ శ్రీ బద్రి చేసిన స్టంట్‌కు సినిమా యూనిట్‌ అంతా ఫిదా అయ్యారు. దీనికి గానూ ఆయన రూ.50వేల పారితోషకం అందుకున్నారు. తాజాగా తన రెమ్యునరేషన్‌ను జనసేన పార్టీకి విరాళంగా అందించారు. జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ను స్వయంగా కలిసిన శ్రీబద్రి విరాళానికి సంబంధించిన చెక్‌ను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా పవర్‌స్టార్‌ స్టంట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా ఇండస్ట్రీకి ఆయన అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెహికిల్స్‌తో ఎలాంటి డేర్‌ డెవిల్స్‌ స్టంట్స్‌ చేయాలన్నా అది శ్రీ బద్రికే సాధ్యం. నేను నటుడిగా శిక్షణ పొందుతున్న దగ్గరి నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. చిరంజీవి నటించిన ‘భోళా శంకర్‌’లో కారుతో ఓ స్టంట్‌ చేసినందుకు అందుకున్న రూ.50వేల రెమ్యునరేషన్‌ను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

పవన్‌ ముఖ్యమంత్రి అవ్వాలి..

ఇక శ్రీ బద్రి మాట్లాడుతూ.. ‘సాటి మనిషికి సాయం చేయాలన్న గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 28 ఏళ్ల క్రితం మీరు నాకు సాయం చేశారు. ఆ సాయం వల్ల నేను స్టంట్‌మ్యాన్‌ అయ్యాను. ఇప్పుడు భార్యా, పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నాను. నా చిన్న కూతురు అమెరికాలో చదువుకుంటోంది. ఇదంతా మీ దయే. మీరు చేసే సాయం నాతో ఆగిపోకూడదు. మీరు ముఖ్యమంత్రి అయి, నాలాంటి వాళ్లకు మరింత సాయం చేయాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. అలాగే ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్లో కూడా బిజీగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ ను కలిసిన శ్రీ బద్రి..

పవన్ కల్యాణ్ సాయం నాతో ఆగిపోకూడదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.