AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: కల్కి పార్ట్ 2లో కృష్ణుడిగా ఆ స్టార్ హీరో.. నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదేనా..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో వాడిన గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించింది. కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ని అందరూ కొనియాడుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Kalki 2898 AD: కల్కి పార్ట్ 2లో కృష్ణుడిగా ఆ స్టార్ హీరో.. నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదేనా..
Kalki 2898 Ad
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2024 | 2:40 PM

Share

ఇండస్ట్రీ షేక్ అవుతుంది.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు స్థాయి మరో మెట్టు పైకెక్కింది. ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి సినిమా హవానే కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో వాడిన గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించింది. కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ని అందరూ కొనియాడుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తొలి రోజు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.191 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా భారీగానే రాబట్టిందని తెలుస్తోంది. ఈ సినిమ వెయ్యి కోట్లు అవలీలగా వసూల్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్..

ఇదికూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

ఇక కల్కి సినిమాలో చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ను వాడాడు నాగ్ అశ్విన్. మృణాల్ ఠాకూర్, శోభనా, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ నటించారు.. అలాగే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, అవసరాల శ్రీనివాస్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కాగా అర్జునుడిగా విజయ్ దేవర కొండ నటించి మెప్పించాడు. కాగా కృష్ణుడి పాత్రను మాత్రం చూపించకుండా.. ఓ నల్లటి రూపంలో చూపించారు. అయితే ఈ పాత్ర చేసింది ఎవరో కాదు.  తమిళ్ యాక్టర్ కృష్ణ కుమార్. అయితే పార్ట్ 2లో కృష్ణుడిగా ఆయన కనిపించకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది.

ఇదికూడా చదవండి : ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు పిచ్చెక్కించేలా

నాగ్ అశ్విన్ కల్కి సినిమాను మరిన్ని పార్టులుగా తెరకెక్కించనున్నాడు. కల్కి సినిమా చివరలో పార్ట్ 2కి హింట్ ఇస్తూ ఎండ్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ లో కృష్ణుడి పాత్ర ప్రధానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపిస్తారట. అందుకోసం కల్కి సినిమాలో కృష్ణుడి ఫేస్ ను రివీల్ చేయలేదని టాక్ వినిపిస్తుంది. పైగా సినిమా రిలీజ్ అయిన తర్వాత  కృష్ణుడి పాత్రకు మంచి హైప్ వచ్చింది. దాంతో సెకండ్ పార్ట్ లో కృష్ణుడిగా స్టార్ హీరో కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది కృష్ణుడిగా మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని అంటున్నారు. మహేష్ బాబు అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని అంటున్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ లో కృష్ణుడిగా ఎవరిని చూపిస్తారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే