Peddada Murthy: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత

|

Jan 03, 2023 | 12:56 PM

విశాఖపట్నం జిల్లా భీముని పట్నానికి చెందిన పెద్దాడమూర్తికి చిన్నప్పటి నుంచి వేటూరి పాటలంటే బాగా ఇష్టం. గేయ రచయితగా మారాలని కూడా అనుకున్నారు.

Peddada Murthy: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
Pedada Murthy
Follow us on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. తెలుగులో పలు హిట్‌ సినిమాలకు పాటల రచయితగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నం జిల్లా భీముని పట్నానికి చెందిన పెద్దాడమూర్తికి చిన్నప్పటి నుంచి వేటూరి పాటలంటే బాగా ఇష్టం. గేయ రచయితగా మారాలని కూడా అనుకున్నారు. అయితే భిన్నంగా జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. పలు ప్రముఖ పత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వర్తించారు. దర్శకుడు కృష్ణవంశీతో పరిచయం ఉండడంతో హైదరాబాదుకు వచ్చి కొన్ని సినీ పత్రికల్లో పనిచేశాడు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సహాయంతో మొదటిసారిగా కూతురు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇడియట్‌, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, అది నువ్వే, నాకూ ఓ లవ్వర్‌ ఉంది తదితర  తెలుగు సినిమాల పాటలు రాశారు.

అమ్మానాన్న ఓ తమిళమ్మాయిలో నీవే నీవే, ఇడియట్ లో చెలియా చెలియా వంటి పాటలు పెద్దాడమూర్తికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగే ఇష్ట సఖి, హౌస్ ఫుల్ అనే ప్రైవేట్‌ ఆల్బమ్స్ కూడా చేశారు పెద్దాడ. కాగా ఆయన గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం పరిస్థితి విషమించడంతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.  కాగా పెద్దాడ మృతితో  టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.  ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..