
తెలుగులో హీరోయిన్స్, సీరియల్ నటులకు మించిన క్రేజ్ ఉన్న ఏకైక సింగర్ ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు సునీత. అందమైన రూపం, అంతకన్నా అందమైన గాత్రం ఉన్న సింగర్ సునీతకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుత గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సునీత. తన తీయని గొంతుతో పాడిన పాటలకు ఎన్నో రివార్డులు, అవార్డులు సునీత ఇంటికి క్యూ కట్టాయి. సంగీత ప్రపంచంలో ఎంతో మంది యంగ్ సింగర్స్ కు స్పూర్తి గా నిలుస్తుందామె. ప్రస్తుతం పలు సింగింగ్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు సునీత. ఇదిలా ఉంటే సునీత కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సునీత కూతురు ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సునీత కూతురు శ్రేయ.. ఇటీవలే ఆమె అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తిచేసింది. అక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న శ్రేయతో కలసి సరదాగా గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సునీత కాస్త ఎమోషనల్ అయ్యింది.‘మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా గారాల పట్టి ఇప్పుడు ప్రాట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇల్లుస్ట్రేటర్‌గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. తనను చూస్తుంటే ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు సునీత కూతురి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రేయ కూడా అమ్మబాటలోనే నడుస్తూ ఒక సినిమాలో పాట కూడా పాడింది..అయితే ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. దాంతో శ్రేయ హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని సునీత అభిమానులు కోరుకుంటున్నారు. కాగా సునీత కుమారుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే సినిమాలో నటించాడు ఆకాష్. అలాగే మరో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కాగా ప్రస్తుతం శ్రేయ ఫోటోలు నెటిజన్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఆమె వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.