Rahul Sipligunj: చిచ్చా మొత్తం మారిపోయిండుగా.. డిజైనర్ సూట్‌లో ఏక్ ధమ్ కొడుతుండూ..
ఏం కాక' అంటూ కనిపించినోళ్లను పలకరించేటోడు.. ఇప్పుడేకంగా కనిపించినోళ్లందరికీ పెక్ ఇస్తూ పోతుండు! ఇలా మొత్తానికి కాక మొత్తం మారిపోయిండులే అని మన భాగ్యనగర్ పోరగాళ్లతోని అనిపించుకుంటుండు రాహుల్ సిప్లిగంజ్.!
గల్లీపోరడు.. గా ఆస్కార్ అవార్డు వరకు పోయిండు! తీర్మాన్.. దో మార్ అంటూ మాసు బట్టల్లో ఎగిరేటోడు.. ఏకంగా సూట్ బూటుల్లో సక్కంగా కనిపిస్తుండు! ఈడీడే పాటలు పాడుతూ తిరిగేటోడు.. ఇప్పుడు గా.. ఆస్కార్ ఏడుకలో పాడబోతుండు! ‘ఏం కాక’ అంటూ కనిపించినోళ్లను పలకరించేటోడు.. ఇప్పుడేకంగా కనిపించినోళ్లందరికీ పెక్ ఇస్తూ పోతుండు! ఇలా మొత్తానికి కాక మొత్తం మారిపోయిండులే అని మన భాగ్యనగర్ పోరగాళ్లతోని అనిపించుకుంటుండు రాహుల్ సిప్లిగంజ్.! హైదారాబాద్ గల్లీ పోరడిగా.. పాటలు పాడుతూ.. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మారిపోయిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఆస్కార్ వరకు చేరుకున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్లో.. ట్రిపులర్ ఆర్ కోసం… తాను పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. ఒక్క సారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేశారు రాహుల్. రావడమే కాదు.. గ్లోబల్లీ బజ్ చేయడం కూడా మొదలెట్టారు. స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఆస్కార్ వేదిక మీద తనకు క్రేజ్ తీసుకొచ్చిన నాటు నాటు పాటనే లైవ్లో పాడబోతున్నారు రాహుల్. ఇక అందుకోసమే రీసెంట్‌గా లాస్ ఏంజిల్స్‌లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవ్వడమే కాదు.. తన లుక్ ను పూర్తి గా మార్చేశారు కూడా..!
డిజైనర్ సూట్ బూటు బట్టల్లోకి ట్రాన్స్ ఫాం అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేస్తున్నారు. ఇటు మన వాళ్లతో.. అటు హాలీవుడ్ స్టార్లతో ఫోటోలకు తీసుకుంటూ… ‘కాక మొత్తం మారిపోయిండులే’ అనే కామెంట్స్ తన లోకల్ ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.