Tollywood: ఇన్‌స్టాలో ఎంగేజ్మెంట్, పెళ్లి ఫొటోలు డిలీట్! ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ సింగర్

తన వైవాహిక జీవితం గురించి వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వదంతులపై టాలీవుడ్ స్టార్ సింగర్ స్పందించింది. భర్త పృథ్వీనాథ్ వెంపటి తో తనకు మనస్పర్థలు తలెత్తాయంటూ వస్తోన్న వార్తలు ఒట్టి పుకార్లేనని కొట్టి పారేసింది. వివిధ మాధ్యమాల్లో తన గురించి జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.

Tollywood: ఇన్‌స్టాలో ఎంగేజ్మెంట్, పెళ్లి ఫొటోలు డిలీట్! ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ సింగర్
Tollywood Singer

Updated on: Apr 23, 2025 | 11:27 PM

విడాకులు తీసుకుని విడిపోతున్న సెలబ్రిటీల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఆ మధ్యన టీమిండియా క్రికెటర్ యుజు వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని విడిపోయారు. అంతకు ముందు కూడా ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు విడాకులతో తమ వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు లేటెస్ట్ గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, నజ్రియా విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆ స్టార్ కపుల్ స్పందించాల్సి ఉంది. కాగా ఈ మధ్యన విడాకులు తీసుకునే వారు ముందుస్తుగా కొన్ని సంకేతాలిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ భర్త, భార్యలను అన్ ఫాలో చేయడం, తమ జీవిత భాగస్వామి ఫొటోలు, ఎంగెజ్మెంట్, మ్యారేజ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ సింగర్ కూడా తన భర్త ఫొటోలతో పాటు ఎంగెజ్మెంట్, పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీల్ చేసింది. దీంతో ఆ యంగ్ సింగర్ వైవాహిక జీవితంపై పలు సందేహాలు తలెత్తున్నాయి.  భర్తతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయా? అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇలా రూమర్లతో వార్తల్లో నిలిచిన ఆ సింగర్ మరెవరో కాదు హారికా నారాయణ్.

హారిక నారాయణ్ గతేడాది మార్చి 17న వివాహం చేసుకుంది. ఇరు పెద్దల సమక్షంలో పృథ్వీనాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేసింది. అంతకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు హారికా నారాయణ్ ప్రేమలో ఉన్న సంగతి గాని, పెళ్లి చేసుకుంటున్నారన్న సంగతి గాని ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి

సింగర్ హారికా నారాయణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఒకరినొకరు ఫాలో అవుతున్నా..

అయితే ఇప్పుడు హారికా నారాయణ్ ఇన్ స్టా పేజీని గమనిస్తే… భర్త పృథ్వీనాథ్ వెంపటితో కలిసి దిగిన ఫొటో ఒక్కటి కూడా లేదు. ఎంగేజ్ మెంట్ తో పాటు పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అటు పృథ్వీనాథ్ పేజీలోనూ హారిక నారాయణ ఫొటోలు అసలే లేవు. దీంతో హారికా నారాయణ్, పృథ్వీనాథ్ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయని సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి.

 

క్లారిటీ ఇచ్చిన హారిక..

తన వైవాహిక జీవితంపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న రూమర్లపై సింగర్ హారిక నారాయణ్ స్పందించింది. భర్తతో మనస్పర్థలు, విడాకుల వార్తలు  ఒట్టి పుకార్లేనని స్పష్టం చేసింది.  సోషల్ మీడియాలో  తన గురించి వస్తోన్న కథనాలను నమ్మవద్దని కోరింది. తద్వారా విడాకుల రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేసిందీ స్టార్ సింగర్.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.