Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

బోసు బాబు నిర్మాతగా మారకముందు...కెరీర్ ప్రారంభరోజుల్లో.. దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు... ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు.

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..
Bosubabu

Updated on: May 09, 2022 | 1:56 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాదులో సోమవారం తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల సీనియర్ నిర్మాత బోసుబాబు.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుకు బంధువు అవుతారు. దాసరి భార్య దివంగత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. బోసుబాబుకు భార్య, నలుగులు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బోసు బాబు నిర్మాతగా మారకముందు…కెరీర్ ప్రారంభరోజుల్లో.. దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు… ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘రాగదీపం’, నాగేశ్వరరావు, కృష్ణలతో ‘ఊరంతా సంక్రాంతి’, కృష్ణతో ‘ప్రజాప్రతినిధి’, శోభన్ బాబుతో ‘జీవనరాగం’, దాసరి నారాయణరావుతో ‘పోలీస్ వెంకటస్వామి’ సినిమాలను నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?