GG Krishna Rao: టాలీవుడ్ కొనసాగుతున్న వరస విషాదాలు.. ప్రముఖ ఎడిటర్ జిజి కృష్ణారావు మృతి.. సినీ ప్రముఖుల సంతాపం

|

Feb 21, 2023 | 10:18 AM

దర్శకుడు కె విశ్వనాథ్ మరణం తర్వాత ఆయనతో పనిచేసిన ప్రముఖులందరూ ఒకొక్కరుగా సెలవు తీసుకుంటూ చిత్ర పరిశ్రమలో విషాదం నింపుతున్నారు. కళాతపస్వి మరణించిన తర్వాత ఉత్తమ గాయని వాణి జయరాం మృతి చెందగా.. నేడు మూడు నందులను అందుకున్న కృష్ణారావు నేను సైతం అంటూ విశ్వనాథ్ కోసం దివికేగారు.

GG Krishna Rao: టాలీవుడ్ కొనసాగుతున్న వరస విషాదాలు.. ప్రముఖ ఎడిటర్ జిజి కృష్ణారావు మృతి.. సినీ ప్రముఖుల సంతాపం
Gg Krishna Rao Passed Away
Follow us on

సినీ పరిశ్రమలో వరస విషాదాలు వెంటాడుతున్నాయి.  మంగళవారం తెల్లవారు జామున బెంగళూరులో ప్రముఖ సినీ ఎడిటర్  జిజి కృష్ణారావు కన్నుమూశారు. కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి నారాయణరావు సహా అనేకమంది ప్రముఖ టాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేశారు కృష్ణారావు. ముఖ్యంగా అప్పట్లో టాలీవుడ్‌లోని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్,  విజయ మాధవి ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలతో కృష్ణారావుకి సన్నిహితంఉండేది.

దర్శకుడు కె విశ్వనాథ్ మరణం తర్వాత ఆయనతో పనిచేసిన ప్రముఖులందరూ ఒకొక్కరుగా సెలవు తీసుకుంటూ చిత్ర పరిశ్రమలో విషాదం నింపుతున్నారు. కళాతపస్వి మరణించిన తర్వాత ఉత్తమ గాయని వాణి జయరాం మృతి చెందగా.. నేడు మూడు నందులను అందుకున్న కృష్ణారావు నేను సైతం అంటూ విశ్వనాథ్ కోసం దివికేగారు. తెలుగుతో, హిందీ, తమిళం , కన్నడ  సినిమాల్లో దాదాపు   దాదాపు రెండు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన కృష్ణారావు  కన్నుమూశారు.

శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’, ‘శుభలేక’, ‘బొబ్బిలిపులి’, ‘సర్దర్పపారాయుడు’, ‘సూత్రధారులు’, ‘సీతామాలక్ష్మి’ వంటి అనేక క్లాసిక్ తెలుగు సినిమాలలో భాగమయ్యాడు. శృతిలయలు’, ‘ముద్ధమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘సిరివెన్నెల’, ‘శుభాసంకల్పం’, ‘స్వరాభిషేకం’, ‘శ్రీరామరాజ్యం’ ఇంకా ఎన్నో. సినిమాల పట్ల అతనికున్న అభిరుచి అతన్ని అసోసియేట్ డైరెక్టర్,  ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఇతర విభాగాలలో కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

1981లో కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘సప్తపది’కి బెస్ట్ ఎడిటర్ గా కృష్ణరావు నంది అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమా నుంచి ఎడిటర్ విభాగంలో నంది ఇవ్వడం మొదలు పెట్టారు. అనంతరం ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ చిత్రాలకు కృష్ణారావు ఎడిటర్ పని నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కళాతపస్వి కే విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కినవి కావడం విశేషం.

‘మిలన్’, ‘ఈశ్వర్’, ‘సుర్ సంగమ్’, ‘జ్వర్ భట’ 1973, ‘మస్తానా’ 1970 వంటి సూపర్ హిట్ హిందీ సినిమాలతో పాటు.. ‘ఎజుమలైయన్ మహిమై’ 1997, ‘సలంగై ఓలి’ 1983 వంటిది అనేక తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.

గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో ఎమ్మెసీ చేసిన జి.జి. కృష్ణారావు మొదట ఆర్మీలో చేరాలని భావించారు. అయితే అనుకోకుండా పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. 1961-62లో ఎడిటింగ్ కోర్సు చేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకులు, ఎడిటర్ ఆదుర్తి సుబ్బారావుగారి దృష్టిలో పడ్డారు. ఆలా చెన్నైలో అడుగు పెట్టిన కృష్ణారావు..‘పాడవోయి భారతీయుడా’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కూర్పరిగా చేశారు. కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..