Krishna Veni : ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం

|

Jun 04, 2021 | 9:48 PM

Krishna Veni : వెండి తెరపై కనిపిస్తూ.. అందరికీ నవ్వులు పంచె నటుల నిజ జీవితాల్లో ఎన్నో వ్యథలు. కన్నీరు పెట్టించే కథలుంటాయనిడానికి ఉదాహరణ తెలుగు సీనియర్ నటి కృష్ణవేణి..

Krishna Veni : ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం
Krishna Veni
Follow us on

Krishna Veni : వెండి తెరపై కనిపిస్తూ.. అందరికీ నవ్వులు పంచె నటుల నిజ జీవితాల్లో ఎన్నో వ్యథలు. కన్నీరు పెట్టించే కథలుంటాయనిడానికి ఉదాహరణ తెలుగు సీనియర్ నటి కృష్ణవేణి. ప్రస్తుతం జనరేషన్ కు బామ్మా గా తెలిసిన కృష్ణ వేణి వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా నటించిన రెండు సినిమాల్లో ఒకటి రిలీజ్ కు నోచుకోలేదు.. మరొకటి ప్లాప్ గా నిలిచింది. దీంతో అందం అభినయం ఉన్నా హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకోలేక పోయారు కృష్ణవేణి.

కృష్ణ వేణి తెలుగు సినిమా ప్రేక్షకుకులకు.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్న ముఖం. జనం గుర్తుంచుకునే పాత్రలనే చేశారు. భద్ర వంటి సినిమాల్లో చక్కటి కామెడీ పండించి నవ్వులు పూయించారు.
అయితే కృష్ణవేణి సినిమా రంగంలో బాగానే రాణించినా.. నిజ జీవితంలో మాత్రం సినిమా హీరోయిన్ పడిన కష్టాలు పడ్డారు. కృష్ణవేణికి 10 ఏళ్ల వయసుకే తల్లిదండ్రులు బాల్యవివాహం చేశారు. 13 ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. అయితే భార్య భర్తల మధ్య వచ్చిన బేధాభిప్రాయాలతో కృష్ణ వేణి విడాకులు తీసుకున్నారు.
కుటుంబ పోషణ కోసం సినిమాల్లో, సీరియల్స్ లో ఏ చిన్న పాత్రలు ఇచ్చినా నటించింది. తర్వాత తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. దీంతో అమెరికాకు వెళ్ళిపోయింది కృష్ణవేణి.. అక్కడ ఓ ఇంట్లో వృద్ధుడికి కొన్ని రోజుల పాటు కేర్ టేకర్‌గా కొనసాగింది. ఆ తర్వాత ఆమె సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కృష్ణవేణిని విధి మరోసారి చిన్న చూపుచూసింది. రెండో భర్త కూడా రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు.

తర్వాత మళ్ళీ కృష్ణవేణికి ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులైనా రజిత, రాగిణి కృష్ణ వేణి బంధువులు .. ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన సమయంలో అండగా నిలబడుతున్నారు. ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో నటిస్తున్న కృష్ణ వేణి .. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ.. కాస్త డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు.

Also Read: గాయపడిన బొద్దింకను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన ఓ వ్యక్తి.. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్