Kona Venkat: చిన్ననాటి స్కూల్‌కు సరికొత్త వెలుగులు.. సీఎం జగన్‌పై ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ప్రశంసలు

|

Jan 29, 2024 | 9:18 PM

. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ట్రెండ్‌ను క్రియేట్‌ చేసుకున్న కోన వెంకట్‌ తాజాగా తన సొంత గ్రామంలో పర్యటించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్‌ అంతా కలియతిరిగారు. ఆధునిక వసతులు, సౌకర్యాలతో ఏర్పాటు

Kona Venkat: చిన్ననాటి స్కూల్‌కు సరికొత్త వెలుగులు.. సీఎం జగన్‌పై ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ప్రశంసలు
Kona Venkat, CM Jagan
Follow us on

 

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను చూసి ఆశ్చర్యపోయానంటూ కొనియాడారు. వివరాల్లోకి వెళితే.. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ట్రెండ్‌ను క్రియేట్‌ చేసుకున్న కోన వెంకట్‌ తాజాగా తన సొంత గ్రామంలో పర్యటించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్‌ అంతా కలియతిరిగారు. ఆధునిక వసతులు, సౌకర్యాలతో ఏర్పాటు చేసిన తరగతి గదులను పరిశీలించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ట్విట్టర్‌ వేదికగా స్కూల్‌ సందర్శనకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన కోన వెంకట్‌ ‘నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలు నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్‌ షేర్‌ చేసిన ఫొటోలు, కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ గా మారాయి. ‘జగనన్న సంక్షేమ పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అంటూ వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు కోన వెంకట్‌. తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సీక్వెల్‌ను ఇటీవలే అధికారికంగా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఎంవీవీ సినిమా బ్యానర్‌, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థ సంయుక్తంగా ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమాను పట్టాలెక్కించారు. ఈ సందర్భంగా సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి అంద‌జేశారు. సినిమాలో శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా గీతాంజలి 2 సినిమాకు కోన వెంక‌ట్‌ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

 

కోన వెంకట్‌ ట్వీట్

గీతాంజలి 2 తో మళ్లీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..