Dil Raju: టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఇంట మరో విషాదం.. అప్పుడు భార్య ఇప్పుడు..

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం..

Dil Raju: టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఇంట మరో విషాదం.. అప్పుడు భార్య ఇప్పుడు..
Dil Raju

Updated on: Oct 10, 2023 | 2:02 PM

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కాగా టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్‌ బాస్టర్‌ మువీస్‌ నిర్మించారు. నిర్మాత దిల్ రాజు పూర్తి పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే కుటుంబం అంతా రాజు అని పిలవడంతో రాజు అనే పేరు స్థిరపడిపోయింది. నితిన్‌ హీరోగా నటించిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు పలు వ్యాపారాలు చేసిన ఆయన సినీ డిస్ట్రిబ్యూటర్‌గా తొలినాళ్లలో పనిచేశారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్‌రాజు తెలుగు సినీ పరిశ్రమలో మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో 2017లో మరణించింది. వీరికి హన్షిత అనే కుమార్తె జన్మించింది. అనిత మరణానంతరం దిల్‌ రాజు తేజస్వినిని 2020 రెండో వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.