సినిమా షూటింగ్‌లపై బిగ్ అప్‌డేట్ ఇది. 18 రోజులుగా నిలిచిన మూవీ షూటింగ్‌లపై ఇవాళ క్లారిటీవచ్చే అవకాశముంది. సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపై, సినీపరిశ్రమ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు..అయితే ఆగస్టు 1 నుంచి నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లను ఈ నెల 22 నుంచి ప్రారంభించేందుకు నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనెల తొలివారంలో జరిగిన సమావేశంలో ఓటీటీ, టిక్కెట్ ధరలు, విపిఎఫ్ ఛార్జీలు, నిర్మాణ వ్యయంపై చర్చించారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల రెమ్యూనరేషన్‌పై చర్చించారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. డైలీ పేమెంట్ ఆర్టిస్ట్‌లు, ఆర్టిస్ట్‌ల స్టాఫ్ ఖర్చులు తదితర అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపారు.