గోపికమ్మగా పుట్టి… ఇక్కడే బుట్టబొమ్మగా ఎదిగిన పూజా హెగ్డే… ఇప్పుడు రేట్ కార్డ్ కూడా మార్చేశారు. ఒక్కో సినిమాకు మూడున్నర కోట్లకు పైనే అడుగుతున్నారట. మనం చెయ్యిచ్చి పైకి లేపిన కామ్రేడ్ బ్యూటీ రష్మిక కూడా డిమాండ్ అండ్ సప్లై ఫార్ములాను గుర్తు చేస్తున్నారు. టాప్ చెయిర్స్ టేకప్ చేసిన గ్లామర్ క్వీన్స్ ఎవరూ ఇప్పుడు మనోళ్లకు అందుబాటులో లేరు. అందుకే… సీరియస్ గా కొత్త బంగారం వైపు చూస్తున్నారు తెలుగు సినిమా మేకర్స్.
హిపోక్రసీ వదిలేసి చెప్పుకుంటే ఉప్పెన సినిమా టాలీవుడ్ లో ఒక పాత్ బ్రేకర్. కంటెంట్ అండ్ కమర్షియల్ రిజల్ట్ అటుంచితే… వీటన్నిటికీ అతీతంగా ఒక చిత్రమైన ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ఉప్పెన. డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్…! ఇలా ఆల్- ఫస్ట్ తో అదరగొట్టిన సినిమాలు గతంలో కొన్ని వున్నా.. లేటెస్ట్ జెన్ లో మాత్రం ఉప్పెన ఒక్కటే సేలియంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడా డెబ్యూ డైరెక్టర్ ప్లేస్ ఎక్కడ, డెబ్యూ హీరోకి ఎన్ని ఛాన్సులు కొత్తగా వచ్చాయి అనేదానికంటే.. డెబ్యూ హీరోయిన్ క్రితి శెట్టి ఫ్యూచర్ గురించే ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరిగింది.
నిన్న మొన్నే పదహారు నిండిన కన్నడమ్మాయి క్రితి శెట్టి.. అనుష్క శెట్టి, శిల్పాశెట్టిలా కొత్త కొత్త హైట్స్ కి చేరుతుందో లేదో గానీ.. ఉప్పెన తర్వాత ఆమె ఖాతాలో అరడజను సినిమాలొచ్చి పడ్డట్టు వార్తలొచ్చాయి. నా చేతిలో వున్నవి ఇవేనండీ బాబూ అంటూ ఆ నాలుగు సినిమాల లిస్ట్ ట్విట్టర్లో పెట్టారంటే ఆమె మీద హైప్ ఏ రేంజ్ లో ఏర్పడిందో తెలిసిపోతుంది. రామ్ పోతినేని చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీలో కూడా క్రితి శెట్టినే ఫిమేల్ లీడ్ గా తీసుకున్నారు.
ఆస్కింగ్ శాలరీని అరకోటికి లోపలే కోట్ చేసే ఇటువంటి న్యూ కమ్మర్స్ మీదే మేజర్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్. అటు… డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే లైనప్ క్రియేట్ చేసుకునే హీరోయిన్లలో కొత్తగా చేరిపోయారు మీనాక్షి చౌదరి. సుశాంత్ మూవీ ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’లో నటించారామె. ఆ సినిమా ఫలితం తేలకముందే నానీ ప్రొడ్యూస్ చేస్తున్న హిట్2, రవితేజ హీరోగా చేస్తున్న ఖిలాడీ కాస్టింగ్ లో ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి. IVNR ప్రీ-రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లే… ఎప్పుడైనా అడిగితే మాక్కూడా కాల్షీట్స్ ఇస్తుండమ్మా అని ఆన్-స్టేజ్ రిక్వెస్ట్ చేసుకున్నారు.
క్రితి శెట్టి తర్వాత ఉప్పెనలా దూసుకొచ్చిన ఇటువంటి నవ కెరటాలు తెలుగులో చాలానే వున్నాయి. తెలుగులో రిలీజైన రీసెంట్ సర్ ప్రైజ్ మూవీస్ తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం..! ఈ రెండు సినిమాల్లోనూ ఫిమేల్ లీడ్ లో నటించి… బెస్ట్ హీరోయిన్ మెటల్ అనిపించుకున్నారు ప్రియాంక జవాల్కర్. సినిమాకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రియాంక.. ప్రస్తుతం మన డైరెక్టర్స్ కి బెటర్ ఛాయిస్ అయ్యారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు బిగ్ మూవీస్ లో ఆఫ్-బీట్ ఫిగర్స్ నే పిక్ చేసుకున్నారు. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ నీ, భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్ ని పిలిచి ఛాన్సులిచ్చారు. సైజ్ ఆఫ్ ది రోల్ తక్కువ కావడం కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. చిన్న పాత్రలకైనా టాప్ హీరోయిన్లనే ఫస్ట్ ఛాయిస్ గా పెట్టుకునే ట్రెండ్ కి ఇలా బ్రేక్ వేస్తున్నారు మనోళ్లు. ఇంకా… వీలయితే ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నీ, మరో మలయాళీ సెన్సేషన్ మాళవిక మోహనన్ నీ కూడా వెల్ కమ్ చేస్తూ… చీప్ అండ్ బెస్ట్ పాలసీకి ఓటేస్తున్నారు కొత్త కెప్టెన్లు. ఇలా… పాతిక-యాభై లక్షల మధ్యే రెమ్యునరేషన్ తీసుకునే ఫ్రెష్ అండ్ నైబర్ టాలెంట్ కి తెలుగులో క్రమంగా గిరాకీ పెరుగుతోందిప్పుడు.
– రాజా శ్రీహరి, TV9 Telugu, ET డెస్క్
Also Read..
కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్ యూనిట్.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో.