Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Rekha Comments on Raviteja: ఓ డైరెక్టర్‌ వైఫ్‌, స్టార్‌ హీరోపై చేసిన కామెంట్స్‌, ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారాయి. ఎవరా స్టార్‌ హీరో? అయనపై దర్శకుడి వైఫ్‌ ఎందుకు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!
Movie

Updated on: Feb 13, 2022 | 5:57 AM

Rekha Comments on Raviteja: ఓ డైరెక్టర్‌ వైఫ్‌, స్టార్‌ హీరోపై చేసిన కామెంట్స్‌, ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారాయి. ఎవరా స్టార్‌ హీరో? అయనపై దర్శకుడి వైఫ్‌ ఎందుకు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వివరాల్లోకెళితే.. మాస్‌ మహారాజా రవితేజ వర్సెస్ డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్‌ వారు కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా డైరెక్టర్‌ రమేష్‌ వర్మ భార్య రేఖా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో రవితేజను ఉద్దేశిస్తూ చీప్‌ యాక్టర్‌ అంటూ కామెంట్‌ చేశారామే. రేఖావర్మ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ మారాయి. ఇటీవల ఖిలాడి మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రమేష్‌ వర్మపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు రవితేజ. అవి కాస్తా సటైరికల్‌గా ఉన్నప్పటికి వాటిని పెద్దగ పట్టించుకోలేదు రమేష్‌ వర్మ. అంతా బాగానే ఉన్నట్లు వ్యవహరించారు ఈ ఇద్దరూ. కానీ, రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రేఖ పోస్ట్‌ చేసిన ఇన్‌స్టా పోస్టులతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ, డైరెక్టర్‌పై కాస్తా అసహనం​ ప్రదర్శించాడు. ఖిలాడీ సినిమాకు సంబంధించి నిర్మాతే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవితేజ. అంతకుముందు దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్‌ కామెంట్స్‌ చేశాడు రవితేజ. రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గా చెప్పేశాడు మాస్‌ మహరాజ్. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి కోల్డ్‌వార్ నడుస్తుండగానే రమేశ్‌ వర్మ భార్య చేసిన కామెంట్స్ టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారాయి. గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్‌ యాక్టర్‌ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది అంటూ పోస్ట్ పెట్టారు రేఖావర్మ. ఇది కలకలం రేపింది. రవితేజ, రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో గతంలో వీరా మూవీ వచ్చింది. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చింది ఖిలాడీ.

Also read:

Gujarat Bank Fraud: దేశంలో వెలుగులోకి భారీ కుంభకోణం.. వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన గుజరాత్ వ్యాపారి..

Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..

Gold Silver Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..