Telugu Heros: పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో సినిమా మార్కెట్ మాత్రమే కాదు మన హీరోల రేంజ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పేస్ ఆఫ్ ఇండియా సినిమాగా టాలీవుడ్‌ను మార్చేసిన తెలుగు హీరోలు… బ్రాండ్ ఎడార్స్‌మెంట్ విషయంలోనూ నార్త్ స్టార్స్‌కు టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నారు. ప్రజెంట్ లాంగ్ బ్రేక్ తీసుకున్న బన్నీ ఈ గ్యాప్‌ను బ్రాండ్ షూట్స్‌కు యూజ్ చేసుకుంటున్నారు. పుష్ప(Pushpa) రిలీజ్ తరువాత బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎమర్జ్ అయ్యారు. పుష్ప రాజ్ యాటిట్యూడ్‌కు సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు. నేషనల్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. పుష్ప అనే పేరే నేషనల్ బ్రాండ్‌గా మారిపోయింది. బన్నీ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్రాండ్స్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాయి. పుష్ప 2 ఇంకా సెట్స్ మీదకు రాకపోయినా… బన్నీ మాత్రం కెమెరా ముందే బిజీగా ఉన్నారు. వరుసగా ముంబై(Mumbai), హైదరాబాద్(hyderabad)లలో యాడ్ షూట్స్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్‌తో బన్నీ చేస్తున్న యాడ్ షూట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. షూట్స్ మాత్రమే కాదు లాంచ్ ఈవెంట్స్‌లోనూ బన్నీ ప్రజెన్స్ అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాయి కంపెనీస్.
బన్నీ రేంజ్‌లోనే మార్కెట్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ. ఇంత వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా… నేషనల్ స్టార్స్ రేంజ్‌లోనే ఇమేజ్ సంపాందించుకున్నారు విజయ్ దేవరకొండ. త్వరలో లైగర్‌గా ఆడియన్స్ ముందుకు వస్తున్న విజయ్ కోసం కూడా బ్రాండ్స్ గట్టినే ట్రై చేస్తున్నాయి. వీళ్లే కాదు.. మహేష్, అఖిల్ లాంటి హీరోలకు కూడా బ్రాండింగ్స్ విషయంలో డిమాండ్ గట్టిగానే కనిపిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.