AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: ముస్లిం నుంచి క్రైస్తవ మతాన్నికి మారడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన రెజీనా

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది టీవీ సీరియల్స్ లు, యాంకర్స్ గా చేసి కూడా హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా తనను తాను నిరూపించుకుంటుంది ఆ ముద్దుగుమ్మ .

Regina Cassandra: ముస్లిం నుంచి క్రైస్తవ మతాన్నికి మారడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన రెజీనా
Regina Cassandra
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2024 | 2:11 PM

Share

రెజీనా కసాండ్రా..  ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజీనా పుటింది ముస్లిం కుటుంబంలో కానీ ఆతర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజీనా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది. నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది.

ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసుల శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ‘ఏక్ లత్కీ కో దేకా దో’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళంలో పెద్దగా విజయం సాధించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.  నటి రెజీనా కసాండ్రా ప్రస్తుతం మిజ్ తిరుమేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం పొంగల్ పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి రెజీనా ముస్లింగా పుట్టిన తర్వాత క్రిస్టియన్‌గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవడంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగాడు. ఆ తర్వాతే నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజీనా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.