Tollywood : యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మంచి రైజ్‌లో ఉంది. టాలీవుడ్ అగ్ర కథాానాయకులతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. తాజాగా నితిన్ సరసన నటించిన ‘బీష్మ’ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. కాగా అమ్మడు సోషల్ యాక్టివిటీస్‌లో కూడా యాక్టీవ్‌గానే పాల్గొంటుంది. ఇటీవలే బాలయ్యతో కలిసి బసవతారకం క్యాన్సర్ హస్పటల్ ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో పాల్గొని..డాక్టర్ల గొప్పతనం గురించి చక్కగా మాట్లాడింది.
తాజాగా తెలంగాణ పోలీసులపై కూడా ప్రశంసలు కురిపించింది ఈ నటి. మహిళల కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని పేర్కొంది. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే మహిళలు యువతులు గతంలో చాలా భయపడే వారని..పోలీసుల భద్రతతో ప్రస్తుతం నిశ్చింతగా ఉంటున్నారని తెలిపింది. ప్రతి ఒక్కరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలని, పిల్లలకు చిన్నతనం నుంచే మంచి, చెడుల గురించి అవగాహాాన కల్పించాలని అభిప్రాయపడింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి..వారి ఉన్నతికి కృషి చెయ్యాలని రష్మిక మందన్న కోరింది.
ఇది కూడా చదవండి : వెనక్కి తగ్గేది లేదంటోన్న ‘మహానటి’