Keerthy Suresh : నేను శైలజ సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన భామ కీర్తిసురేష్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. క్యూట్ లుక్స్ తో కొంటె చూపులతో ఎంతో మందికి నిద్ర లేకుండా చేసింది. నేను శైలజ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి. అభినయ తార సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన అద్భుతమనే చెప్పాలి.
ఇక మహానటి సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి. కుర్రహీరోలందరి సరసన నటిస్తుంది కీర్తి. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే మరో వీడియోను షేర్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం పరుగు పెడుతూ కనిపించింది. బోట్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఆపండి అంటూ అరుస్తూ కీర్తి పలుగులు పెట్టడం నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. కీర్తి అభిమానులు, నెటిజన్లు ఈవీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :