Kajal Agarwal: ఫేవరెట్ ప్లేస్‌లో భర్తతో కలిసి కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!

|

Feb 15, 2021 | 6:58 PM

Kajal Agarwal Favourite Spot: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి 14) రోజున..

Kajal Agarwal: ఫేవరెట్ ప్లేస్‌లో భర్తతో కలిసి కాజల్ డిన్నర్ డేట్..  అదేంటో మనం కూడా చూసేద్దాం..!
Follow us on

Kajal Agarwal Favourite Spot: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి 14) రోజున తనకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్‌లకు భర్త గౌతమ్ కిచ్లూను తీసుకెళ్లింది. ఇద్దరూ కూడా ఆ ప్రదేశంలో వాలెంటైన్స్ డేను ఎంతో స్పెషల్‌గా జరుపుకున్నారు. ఇక కాజల్ ఫేవరెట్ ప్లేస్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లేదా రిసార్ట్ అనుకుంటే పొరపాటు.. అది ఒక చిన్న మెస్..

పొలాచిలోని హోటల్ శాంతి మెస్ నటి కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ప్రదేశం. వాలెంటైన్స్ డే నాడు భర్త గౌతమ్ కిచ్లూను వెంటపెట్టుకుని అక్కడి వెళ్ళింది. ఆ రోజు రాత్రి కాజల్-కిచ్లూ డిన్నర్ డేట్‌ను జరపుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలిపింది.

”నా ఫేవరెట్ పొలాచీలోని శాంతి మెస్. ఇక్కడ శాంతి అక్క, బాలకుమార్ అన్న ఎంతో ప్రేమగా వడ్డిస్తారు. ఈ మెస్ గత 27 ఏళ్లుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. నేను గత తొమ్మిదేళ్లుగా ఈ హోటల్‌కు వస్తున్నట్లు చెబుతూ.. కాజల్ ఆ మెస్ యజమానులతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది”