Watch Video: పవన్ గెలుపు.. కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్!
హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలను సందర్శించారు. జూన్ 15 శనివారం తెల్లవారి జామున తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాట్లు తెలుస్తోంది. తాను అనుకున్న కోరిక తీరడంతో వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అయితే ముందుగా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తరువాత తిరుపతిలో రాత్రి బసచేసి తెల్లవారి జామున అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు.

హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలను సందర్శించారు. జూన్ 15 శనివారం తెల్లవారి జామున తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాట్లు తెలుస్తోంది. తాను అనుకున్న కోరిక తీరడంతో వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అయితే ముందుగా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తరువాత తిరుపతిలో రాత్రి బసచేసి తెల్లవారి జామున అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ లో ఫ్రెషప్ అయి.. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కాలినడకలో తిరుమల కొండ ఎక్కడంతో అభిమానులు ఫోటోలు దిగేందుకు ఇష్టపడ్డారు.
ఇదిలా ఉంటే తన మామయ్య గెలుపుతో గతంలో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బాబాయ్ ఇంటికి చేరుకుని పుష్ఫగుచ్ఛం ఇచ్చి ఆనందం పట్టలేక గట్టిగా ఆలింగనం చేసుకుని పైకి ఎత్తుకున్నారు. దీనిని చూసిన పవన్ ఫ్యాన్స్ ఇదికదా పవన్ కళ్యాణ్‌పై ఉన్న నిజమైన అభిమానం అంటే అని ఆనందం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించడంతో పవన్ అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్‌కు తన మామయ్య అంటే ఇంత ఇష్టమా అని షాక్‌కు గురవుతున్నారు. సాధారణంగా పవన్ కళ్యాన్ కు ఫ్యాన్స్ ఉండరని, భక్తులు ఉంటారని చాలా సందర్భాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఆ భక్తిని శ్రీవారిపై ఇలా చూపించాడు హీరో సాయి ధరమ్ తేజ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




