Kalki 2898 AD: సౌండ్ పెంచమంటున్న టాప్ స్టార్ల ఫ్యాన్స్
సినిమా సక్సెస్‌లో సంగీతం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్ ముందుకు వచ్చే మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ సినిమాల మ్యూజిక్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ నుంచి కంప్లయింట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో దేవరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Updated on: Jun 15, 2024 | 12:47 PM

పక్కా ప్లానింగ్‌తో జెట్ స్పీడుతో షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నుంచి రాబోయే నెక్ట్స్ సెన్సేషన్ ఈ సినిమాను అని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

దేవర విసయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. ట్రిపులార్ రిలీజ్ తరువాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైమ్ కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తరువాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకు వచ్చారు.

టీజర్‌తో ఆకట్టుకున్న దేవర టీమ్, సాంగ్ విషయంలో మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేదన్న కంప్లయింట్స్ ఉన్నాయి. లిరిక్స్ గొప్పగానే ఉన్నా... అనిరుధ్ కంపోజిషన్‌లో అవి సరిగా వినిపించటం లేదంటున్నారు తారక్ ఫ్యాన్స్.

కల్కి 2898 ఏడీ టీమ్ మీద ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ అవుతున్నా.. ఇంత వరకు ఒక్క సింగిల్ కూడా రిలీజ్ చేయలేదు నాగీ టీమ్. దీంతో అసలు ఈ సినిమాలో పాటలు ఉంటాయా...? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలాగే ఉన్నా.. సాంగ్స్ కూడా ఇంపార్టెంటే కదా అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.

మ్యూజిక్ విషయంలో పుష్పరాజ్‌కి మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. హీరో ఎలివేషన్ నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ సాంగ్‌తో పాటు సూసేకి అంటూ సాగే మాస్ డ్యూయెట్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్పరాజ్ జోరును మ్యాచ్ చేసే నెంబర్ కావాలంటే మిగిలిన మూవీ టీమ్స్ మీద ప్రెజర్ పెరుగుతోంది.




