Tollywood Drugs Case: డ్రగ్స్ వ్యవహారం పై ఈడీ ద్రుష్టి సారించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయిర్ కెల్విన్ పట్టుబడటం.. ఆ పై అప్రూవర్‌గా మారి తన వద్దనున్న సమాచారాన్ని పోలీసులకు తెలుపడంతో టాలీవుడ్ డొంక కదిలింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంక్వైరీ తుది అంకానికి చేరుకుంది. సమన్లు అందుకున్న 12మందిలోహీరో తనీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా, నందు, ముమైత్ ఖాన్ లను విచారించిన ఈడీ అధికారులు. నేడు తనీష్‌ను విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తనీష్ ఈడీ కార్యాలయానికి చేరుకునాడు. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ అధికారులు తనీష్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్‌లతో గల ఆర్థిక సంబంధాలపై తనీష్‌ను విచారిస్తున్నారు అధికారులు.
ఈడీ నోటీసుల గురించి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. 2017లోనే కేసు ముగిసినా.. మళ్లీ నోటీసులు ఇవ్వడం ఆవేదన కలిగించిందన్నాడు. డ్రగ్స్‌లో పట్టుబడిన కెల్విన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని అంటున్నాడు ఈ కుర్ర హీరో. డ్రగ్స్ వినియోగించే సెలబ్రిటీలు ఎవరైనా తెలుసా అని ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కెల్విన్‌తో తనీష్‌కు గతంలో పరిచయం ఉందా..? ఎప్పుడు కలిశారు..? అలాగే డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారిస్తున్నారు. తనీష్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :