AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sailesh Kolanu: మీపై గౌరవం మరింత పెరిగింది సర్.. ‘హిట్’ చిత్రాల డైరెక్టర్ ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో

'హిట్' ఫ్రాంఛైజీ సినిమాలతో టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలు రాగా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నాని హీరోగా నటించిన హిట్ 3 ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

Sailesh Kolanu: మీపై గౌరవం మరింత పెరిగింది సర్.. 'హిట్' చిత్రాల డైరెక్టర్ ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో
Tollywood Director Sailesh Kolanu
Basha Shek
|

Updated on: Feb 20, 2026 | 6:22 PM

Share

తన డిఫరెంట్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ సిరీస్ లో ఆయన తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ముఖ్యంగా నాని హీరోగా శైలేష్ తెరకెక్కించిన హిట్-3 ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో నాలుగో భాగాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు శైలేష్. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించనున్నాడు. ఇదిలా ఉంటే దర్శకుడు శైలేష్ కొలను తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. మరణానంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ మరణాంతరం తన అవయవాలను సేకరించేందుకు అనుమతినిస్తూ ‘దాత అనుమతి కార్డు’ను అందుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

‘ఇటీవల నా అవయవాలను డొనేట్ చేయడానికి ప్రతిజ్ఞ తీసుకున్నాను. చాలా కాలంగా దీన్ని చేయాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు దీన్ని సులభతరం చేసిన మోహన్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. ఒకరి అవయవాలను దానం చేయడం అనేది మనం చేయగలిగే అత్యంత నిస్వార్థ పనులలో ఒకటి. మరొకరికి సహాయం చేయండి, మరొక జీవితాన్ని జీవించనివ్వండి. ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు. చనిపోయినా సజీవంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ తమ అవయవాలను దానం చేయాలని మీ కుటుంబ సభ్యులకు మీ కోరికను తెలియజేయాలని నేను కోరుతున్నాను’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు శైలేష్.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

ప్రస్తుతం ఈ టాలీవుడ్ డైరెక్టర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది. సినీ ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్లు శైలేష్ కొలనుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొత్త సినిమా లాంఛ్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us