Director Madan: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

|

Nov 19, 2022 | 11:01 PM

రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషించిన ఆ నలుగురు సినిమాకు మదన్‌ రచయితగా పని చేశారు మదన్. ఆతర్వాత జగపతి బాబు - ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ పెళ్లయిన కొత్తలో సినిమాతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Director Madan: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
Director Madan
Follow us on

ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించిందని, ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.   రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషించిన ఆ నలుగురు సినిమాకు మదన్‌ రచయితగా పని చేశారు. ఆతర్వాత జగపతి బాబు – ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ పెళ్లయిన కొత్తలో సినిమాతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మదన్‌ది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి స్వస్థలం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు ఆడటం లో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆయన ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో హైదరాబాద్‌కు వచ్చారు. కొద్ది రోజుల పాటు ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. కొన్ని సినిమాలకు కో రైటర్‌గా కూడా వ్యవహరించారు. ఆనలుగురు సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా మోహన్ బాబుతో తీసిన గాయత్రి సినిమా మదన్ కు చివరి సినిమా. మదన్ క్షేమంగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..