KS Nageswara Rao: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.. అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా తుదిశ్వస విడిచారు. కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్త తెలిసి సినిమా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేఎస్ నాగేశ్వరరావుకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కన్నుమూశారు. కేఎస్ నాగేశ్వరరావు తన సొంత ఊరి నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. అది గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అఆతర్వాత మరో రెండు మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చివరిగా ఏలూరు లో ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన కన్నుమూశారు. కేఎస్ నాగేశ్వరరావుకు భార్య , కుమారుడు, కూతురు ఉన్నారు.
దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కేఎస్ నాగేశ్వరరావే.. ‘పోలీస్’ అనే సినిమా ద్వారా శ్రీహరి హీరోగా మారారు. దర్శక దిగ్గజాలలో ఒకరైన కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా కేఎస్ నాగేశ్వరరావు కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో కేఎస్ నాగేశ్వరరావు దర్శకుడిగా మారారు. కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :