
Tollywood: తెలుగునాట నవ్వులు పండించే కమెడియన్స్ ఎంతోమంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో టిపికల్ స్టైల్ ఉంటుంది. జంధ్యాల(Jandhyala), ఈవీవీ(EVV Satyanarayana), వంశీ వంటి దర్శకులు కామెడీకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. ప్రజంట్ అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. తెలుగులో ప్రజంట్ బ్రహ్మనందం(brahmanandam), రఘుబాబు, ఆలీ, ఎల్‌బి శ్రీరామ్ లాంటి ఓల్డ్ జనరేషన్ యాక్టర్స్ పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్య, షకలక శంకర్, ప్రవీణ్, చమ్మక్ చంద్ర లాంటి న్యూ ఏజ్ కమెడియన్స్ సైతం సత్తా చాటుతున్నారు. కాగా ఈ కమెడియన్స్ చిన్నప్పటి ఫోటోలు ప్రజంట్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతున్నాయి. వారిలో ఓ హాస్యనటుడి చైల్డ్‌హుడ్ ఫోటోను ఇప్పుడు మీ ముందుకు తెచ్చాం. ఇందులో యాక్టర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఆడియెన్స్ తెగ నవ్విస్తారు. ముఖకవలికలతోనే నవ్వించడం ఇతడి స్టైల్. ఇక టైమింగ్ అయితే నెక్ట్స్ లెవల్. రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త అందరి కంటే ముందే ఉన్నాడు. సాధారణ సీన్‌ను కూడా తన టైమింగ్‌తో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఫోటో చూసి కనీసం గెస్ అయినా చేశారా…? లేదా..? అయితే మీకు ఓ క్లూ ఇవ్వబోతున్నాం. అతను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. యస్.. హి ఈజ్ నన్ అదర్ దెన్ వెన్నెల కిశోర్.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిశోర్.. దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో అనుకోకుండా నటుడిగా మారాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఇండియాకు వచ్చి అవకాశాలు ఒడిసిపట్టాడు. పుష్కలంగా టాలెంట్ ఉండటంతో పెద్ద సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ‘వెన్నెల 1 1/2’ అంటూ ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు కిశోర్. ప్రజంట్ అతడు నటించిన ఒకే ఒక జీవితం, కృష్ణ వ్రింద విహారి, హ్యాపీ బర్త్ డే సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.