Nandamuri Taraka Ratna: తారకరత్న మృతికి సంతాపం తెలిపిన ప్రధాని, పలువురు సినీ ప్రముఖులు

23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు

Nandamuri Taraka Ratna: తారకరత్న మృతికి సంతాపం తెలిపిన ప్రధాని, పలువురు సినీ ప్రముఖులు
Taraka Ratna

Updated on: Feb 19, 2023 | 9:10 AM

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూశారు తారకరత్న.. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు.  మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకున్న తారక రత్న మృతదేహం. తారకరత్న మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. పలువురు సినిమా తారలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తారకరత్న మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

తారకరత్న అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. చాలా త్వరగా వెళ్లిపోయారు బ్రదర్… మీ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలి అని భగవంతుడిని కోరుకుంటున్న అని అన్నారు మహేష్.