
గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది కోలీవుడ్ అందాల తార వరలక్ష్మి శరత్ కుమార్. ముంబైకి చెందిన గ్యాలరీస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‍తో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ ముద్దుగుమ్మ. గతేడాది హనుమాన్ తో సహా ఏకంగా ఆరు సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కేవలం రెండు సినిమాల్లో నే కనిపించింది. ఈ ఏడాది ప్రారంభంలో విశాల్ తో కలిసి మదగజరాజ మూవీలో నటించిన వరలక్ష్మి కొన్ని నెలల క్రితమే శివంగి సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మి ప్రస్తుతం తన భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే వరలక్ష్మికి సామాజిక స్పృహ ఎక్కువ. గతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుందీ అందాల తార.
హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు తనవంతుగా సాయం అందించింది వరలక్ష్మి. తన భర్త నికోలయ్ సచ్ దేవ్ తో కలిసి అనాథ పిల్లలకు ఇష్టమైన చెప్పులు, షూస్‌ను అందించింది. అలాగే వారితో సరదాగా గడిపి పిల్లలకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది వరలక్ష్మి. ఆరు నెలల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు వరలక్ష్మి నికోలయ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జన నాయగన్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. విజయ్ దళపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విజయ్ కు ఇది ఆఖరి సినిమా కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జన నాయగన్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది వరలక్ష్మి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..