
కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో… తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా.. ఇప్పుడు ఏకంగా తండ్రిని మించిన తనయురాలు అనే ట్యాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. అందరూ స్టన్నయ్యేలా తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా సైన్ కూడా చేశారు. ఎట్ ప్రజెంట్ ఆ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ , టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ‘ది ఐ’ అనే హాలీవుడ్ సినిమాను చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతోంది. ఇక డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో.. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి టాలీవుడ్ , కోలీవుడ్ లానే హాలీవుడ్ లోనూ ఈ చిన్నది సక్సెస్ అవుతుందేమో చూడాలి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రుతిహాసన్. రీఎంట్రీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారనుంది.. ఇదే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న మెగా 154 సినిమాలో.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహరెడ్డి మూవీలో నటిస్తోంది.