Suhana Khan: చీరకట్టులో మెరిసిన షారుక్ ముద్దుల కూతురు సుహానా ఖాన్..
చీరకట్టుకుని క్యామ్ కి ఇచ్చిన ఫోజులిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో సుహానా క్రీమ్ కలర్ పలుచని సారీ..మ్యాచింగ్ షోల్డర్ లెస్ బ్లౌజు ధరించింది.
Updated on: Oct 26, 2022 | 9:30 AM

బాద్ షా షారుక్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు నెట్టింట మహా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్లలో కాకలు పుట్టిస్తుంది. ఎలాంటి పోటోలు నెట్టింట వైరల్ అవుతాయో సుహానాకి బాగా తెలుసని ఎన్నోసార్లు రుజువు చేసింది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అంతకు మించిన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.కురచ దుస్తులే కాదు..సమయం వస్తే చీర కట్టి మరీ ఆకర్షించుకుంటానని మరోసారి అమ్మడు నిరూపించింది.

చీరకట్టుకుని క్యామ్ కి ఇచ్చిన ఫోజులిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో సుహానా క్రీమ్ కలర్ పలుచని సారీ..మ్యాచింగ్ షోల్డర్ లెస్ బ్లౌజు ధరించింది

సుహానాని ఇలా చూసి కొన్ని హృదయాలు తట్టుకోలేకపోతున్నాయి. సుహానా సో క్యూట్ అంటూ కామెంట్లు పెట్టిస్తున్నాయి.

`ది అర్జీస్` తో సుహానా ఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో చాలా మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు.




