Tollywoood: ‘ఫుల్ యాక్షన్ మోడ్’.. జిమ్‌లో కండలు పెంచుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా హీరోలు/ హీరోయిన్లు ఫిట్ నెస్ విషయంలో పక్కాగా ఉంటారు. హెల్దీగా, ఫిట్ గా ఉండేందుకు గంటల తరబడి జిమ్ లో గడుపుతుంటారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన జిమ్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywoood: ఫుల్ యాక్షన్ మోడ్.. జిమ్‌లో కండలు పెంచుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress Samantha

Updated on: Nov 22, 2025 | 6:42 AM

సినిమా హీరోలు, హీరోయిన్లు ఫిట్ నెస్ కు బాగా ఫ్రాధాన్యమిస్తారు. షూటింగులు, ఇతర పనులతో నిత్యం బిజీగా ఉన్నప్పటీకి జిమ్ కోసం రోజులో కొన్ని గంటలు కచ్చితంగా కేటాయిస్తారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తారు. అంతేకాదు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఫాలోవర్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జిమ్ లో కసరత్తులు చేస్తోన్న ఫొటోలను షేర్ చేసింది. అవి క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే ఇందులో ఆమె పురుషులతో సమానంగా కండలు పెంచింది. చాలా బలంగా, ఫిట్ గా కనిపిస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సామ్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం మానేయలేదు. గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తోంది. తాజాగా ఆమె టోన్డ్ బాడీని చూసిన అభిమానులు వావ్ అంటున్నారు. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది సమంత. అంతేకాకుండా సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది. ‘ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నా బ్యాక్‌ బలంగా లేదని వదిలేశా.. ఎందుకంటే నా జీన్స్‌లో అలా లేదని అనుకునేదాన్ని. ఎవరినైనా ‍అలాంటి వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదేమోనని అనుకున్నాను. కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. దానిని ఇప్పుడు చూపించబోతున్నా. ఇక్కడికి చేరుకోవడానికి నేను బాగా శ్రమించాను.’

బాడీలో కండరాలను నిర్మించడం చాలా ముఖ్యం.. మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు.. మీరు ఎలా జీవిస్తారు.. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుతుందనే కండరాలపైనే బేస్ అయ్యి ఉంటుంది. అలాగే మీ వయసు పెరిగే కొద్ది.. బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలి. ఈ బలమైన శిక్షణే నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది.. క్రమశిక్షణ, ఓపికను అలవాటు చేసింది. ఇదంతా జన్యువుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది. అదంతా మనం చెప్పే ఒక సాకు మాత్రమేనని తనకు తెలిసొచ్చింది. నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే.. ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు.. నువ్వు అలానే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది’ అని తన ఫాలోవర్లకు సూచించింది సామ్.

ఇవి కూడా చదవండి

జిమ్ లో సమంత..

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సూపర్ మేడమ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..