Rashmika: రెండు కోట్ల రెమ్యునరేషన్ సంగతి చెబుతున్న అందాల భామ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..
Rashmika: వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మికమందాన్న తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలను
Rashmika: వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మికమందాన్న తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తెలుగు, తమిళంతో పాటు ఇటీవల హిందీలో కూడా ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ భామ ఒక్క సినిమాకు రూ. 2 కోట్లు తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పందించిన రష్మిక అసలు విషయం చెబుతుంది.
‘నేను ఒక్క సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు కొందరు వార్తలు రాస్తున్నారు. వారు చెప్తున సంఖ్య నా కల. ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డా. నా పారితోషికంపై వస్తున్న పుకార్ల స్థాయికి నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను కొత్త కథలను వినడం ఆపేశాను. పెద్ద సినిమాలు మాత్రమే చేస్తున్నాను. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతేడాది సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి నుంచి రష్మిక బిజీగా మారిపోయింది. కెరియర్ ఊపందుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలో చేస్తోంది.