AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కాజల్‌ను నిద్రకు దూరం చేసిన ఆ సంఘటన ఏంటో తెలుసా..? ఆసక్తికర విషయాలను వెల్లడించిన చందమామ..

Kajal Aggarwal Live Telecast: 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తొలిసినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది. రెండో చిత్రం 'చందమామ'లో తన అందంతో...

Kajal Aggarwal: కాజల్‌ను నిద్రకు దూరం చేసిన ఆ సంఘటన ఏంటో తెలుసా..? ఆసక్తికర విషయాలను వెల్లడించిన చందమామ..
Narender Vaitla
|

Updated on: Feb 11, 2021 | 7:18 PM

Share

Kajal Aggarwal Live Telecast: ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తొలిసినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది. రెండో చిత్రం ‘చందమామ’లో తన అందంతో యూత్‌ను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాతోనే కాజల్‌ ‘టాలీవుడ్‌ చందమామ’గా పేరు తెచ్చుకుంది.

ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది మంచి పేరు సంపాదించుకుంది. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తన సత్తా చాటింది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఇటీవల వివాహం చేసుకొని సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ఏ మాత్రం జోష్‌ తగ్గించని ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏకంగా ఆరు సినిమాలతో బిజీగా ఉంది. ఇక కేవలం సినిమాలే కాకుండా తొలిసారి వెబ్‌సిరీస్‌లోనూ నటించిందీ బ్యూటీ. ‘లైవ్‌ టెలికాస్ట్‌’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించారు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ గురించి కాజల్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ విషయమై కాజల్‌ మాట్లాడుతూ.. ‘లైవ్‌ టెలికాస్ట్‌ కోసం షూటింగ్ చేసిన ఇల్లు కొండపై ఉండేది. ఆ ఇంటికి చుట్టుపక్కల పరిసరాల్లో మరో ఒక్క ఇల్లు కూడా లేదు. అక్కడ వాతావరణమంతా నిర్మానుష్యంగా చాలా భయంకరంగా ఉండేది. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన ప్రతి రోజూ రాత్రి నిద్రపట్టేది కాదు. చాలా భయంవేసేది. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకూ ఏరోజు సరిగ్గా నిద్రపోలేదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌ సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్‌ కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌ కథ విషయానికొస్తే.. ఒక షో చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ ఓ ఇంటిలోకి వెళుతుంది. షూటింగ్‌ చేసే సమయంలో ఆ ఇంట్లో ఏవో అతీత శక్తులు ఉన్నట్లు వారు గుర్తిస్తారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వారు ఆ ఇంటి నుంచి క్షేమంగా బయటపడ్డారా.. లేదా? లాంటి ఆసక్తికర అంశాలతో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. మరి ఇన్ని రోజులు తన అందంతో ఆకట్టుకున్న కాజల్‌.. ఎంత వరకు భయపెడుతుందో చూడాలి.

Also Read: Sushmita Sen: అతడు మారడు.. ఆమె వెళ్లిపోతుంది.. బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన మాజీ ప్రపంచ సుందరి..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్