
టాలీవుడ్ లో సినిమాలు , టీవీ షోలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మతో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ చిన్నది సినిమాలకంటే టీవీ షోలతోనే మంది క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే పలు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ మెరిసింది ఈ చిన్నది. ఇక అందాలతోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ నిత్యం తన గ్లామరస్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. రష్మీ తో పాటు మరికొంతమంది భామలు కూడా తమ ఫోటోలను షేర్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి