
Traffic Police : నగరంలోని ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లను తొలగిస్తూ జరిమానాలను విధిస్తున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మరింత జోరు పెంచారు. నిబంధనలకు విద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉన్న కార్లకు జరిమానా విధిస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రెటీలకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవల ఎన్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను పోలీసులు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు.. బన్నీ కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు
బ్లాక్ ఫిల్మ్ ను తొలగించడంతోపాటు జరిమానా కూడా విధించారు. అలాగే కల్యాణ్ రామ్ కార్లకున్న నల్ల తెరలను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించి చలానాలు విధించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అదే సమయంలో అటుగా వచ్చిన కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లను కూడా ఆపి తనికీలు చేశారు. ఆ తర్వాత కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించారు పోలీసులు.
మరిన్ని ఇక్కడ చదవండి :