Tollywood: పులితో ఫోటో దిగిన ఈ పిల్లోడు ఇప్పుడు తెలుగునాట తోపు యాక్టర్.. గుర్తుపట్టగలరా..?

వచ్చేశాం.. మీ కోసం ఓ త్రో బ్యాక్ ఫోటో తెచ్చేశాం. ఈ ఫోటోలోని బాలుడు ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లో మస్త్ ట్రెండ్ అవుతున్నాడు. అది సినిమాల కారణంగా కాదు అండోయ్. తన పర్సనల్ లైఫ్ వల్ల. ఇంతకీ మీరు గుర్తుపట్టారా..?

Tollywood: పులితో ఫోటో దిగిన ఈ పిల్లోడు ఇప్పుడు తెలుగునాట తోపు యాక్టర్.. గుర్తుపట్టగలరా..?
Actor Childhood Photo

Updated on: May 15, 2023 | 1:53 PM

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అన్నీ సినిమా వాళ్ల ఫోటోలే. ఫ్యాన్స్ వాటిని ఈ మధ్య తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మీ ముందుకు  ఓ వెర్సటైల్ యాక్టర్ చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చాం. ఆయనెవరో కనిపెట్టగలరా..? చైల్డ్ యాక్టర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి.. హీరోగా రాణించి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇతను అలనాటి సీనియర్ హీరోయిన్, దర్శకురాలి తనయుడు. ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక మేమే రివీల్ చేస్తాం. తను నటుడు వీకే నరేశ్. నరేష్‌ గురించి మనకు తెలుసు. ఆయన జీవితంపై తెలుగువారికి క్లారిటీ ఉంది. ఆనాటి హీరోయిన్‌, డైరెక్టర్‌ విజయనిర్మల కొడుకుగా.. ఇండస్ట్రీకి పరిచయమే. ఆయన సినిమాలతో నవ్వించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అన్నిరకాల ఎమోషన్స్‌ పండించారు. నరేష్‌ పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ముగ్గురు భార్యలు.. వారందరికీ దూరమవడం.. ఇప్పుడు నటి పవిత్రాలోకేష్‌కి దగ్గరవడం జరిగిపోయింది.

మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం.. తన బంధం గురించి పోరాడుతున్నారు. తన కాపురంలో  పవిత్రాలోకేష్‌ వచ్చి చిచ్చుపెట్టారని ఆరోపిస్తున్నారు. ఆరుపదుల వయస్సులో అంతే మెయింటెనెన్స్‌. విలాసవంతమైన జీవితం. నిర్మలమ్మ నుంచి వచ్చిన డబ్బు, చిత్రపరిశ్రమలో హోదా, రాజకీయాల్లోనూ ప్రవేశం. సాఫిగా సాగుతోన్న జీవితం. అయితే నరేష్‌ పర్సనల్‌ టాపిక్‌ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా ఆయన జీవిత కథలో.. ఆయన నటిస్తూ మళ్లీ పెళ్లి అనే సినిమా తర్వలో రాబోతుంది. ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎవరెన్ని అన్నా… ఎలాంటి వివాదాలు చుట్టుముట్టినా తన లైఫ్ తన ఇష్టం అన్నది నరేశ్ స్టైల్. ఇవన్నీ పక్కనబెడితే నటుడిగా ఆయన మార్క్ అయితే చెక్కు చెదరదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.